హైద‌రాబాద్‌లో వీధికుక్క‌తో శృంగారం… సీసీ పుటేజ్‌తో అడ్డంగా దొరికేశాడు..!

సమాజంలో మాన‌వ సంబంధాలు మంట క‌లుస్తున్నాయి. ముఖ్యంగా డ‌బ్బు, వివాహేత‌ర సంబంధాలు అనేవి మ‌నుష్యుల‌ను ఎంత‌కైనా దిగ‌జార్చేస్తున్నాయి. శృంగారం అనేది మ‌నుష్యుల‌ను ఎంత‌కు అయినా దిగ‌జారేలా చేస్తోంది. అంద‌కే వివాహేత‌ర సంబంధాలు, హ‌త్య‌లు జ‌రుగుతున్నాయి. చివ‌ర‌కు శృంగారం కోసం త‌ట్టుకోలేక అత్యంత జుగుస్సాక‌రంగా దిగ‌జారుతున్నారు కొంద‌రు.

హైద‌రాబాద్‌లో ఓ వ్య‌క్తి కుక్క‌తో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. అస‌లు విన‌డానికే చాలా జుగుస్సాక‌రంగా ఉన్న ఈ సంఘ‌టన వివ‌రాలు ఇలా ఉన్నాయి. హైద‌రాబాద్ న‌ల్ల‌కుంట్ల‌లో ఓ వ్య‌క్తి ఒక‌టి కాదు రెండు కాదు.. మూడు రోజుల పాటు ఓ వీధి కుక్క‌పై.. అది కూడా మ‌గ కుక్క‌పై అస‌భ్య‌క‌రంగా శృంగారం చేవాడు. ఇది సీసీ కెమేరాలో రికార్డు అయ్యింది.

ఓ జంతు ప్రేమికుడు పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజీ సాక్ష్యంతో ఫిర్యాదు చేయ‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వీడియోలో ఆరెంజ్ టీ ష‌ర్ట్ ధరించిన ఓ వ్య‌క్తి కుక్క‌పై అస‌భ్య‌క‌రంగా అత్యాచారం చేస్తోన్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. దీనినే పోలీసుల‌కు సాక్ష్యంగా ఇచ్చాడు ఫిర్యాదు చేసిన వ్య‌క్తి. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష ప‌డేలా చేయాల‌ని ప‌లువురు జంతు ప్రేమికులు కోరుతున్నారు.


Leave a Reply

*