48 ఏళ్ల స్టార్ హీరోకు రెండో పెళ్లి… అంత చిన్న అమ్మాయితోనా..!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ రెండో పెళ్లి దిశ‌గా అడుగులు వేస్తున్నాడు. త‌న భార్య సుసానేఖాన్‌కు కొన్నేళ్ల క్రింద‌టే విడాకులు ఇచ్చేశాడు. అయితే త‌మ ఇద్ద‌రి పిల్ల‌ల కోసం మాత్రం మాజీ భార్య సుసానేతో ఎప్ప‌టిక‌ప్పుడు క‌లుస్తున్నాడు. తాము భార్య‌, భ‌ర్త‌లుగా విడిపోయినా త‌మ పిల్ల‌ల మంచి కోసం తాము త‌ల్లిదండ్రులుగా న్యాయం చేస్తుంటామ‌ని వీరు చెపుతూనే వ‌స్తున్నారు. వీరు విడిపోయాక కూడా పిల్ల‌ల కోసం విదేశాల‌కు, వెకేష‌న్ల‌కు ఎన్నోసార్లు వెళ్లారు.

సుసానే హృతిక్‌కు చిన్న‌ప్ప‌టి స్నేహితురాలు. బాలీవుడ్ సీనియ‌ర్ ద‌ర్శ‌క‌నిర్మాత సంజ‌య్‌ఖాన్‌కు ముద్దుల కుమార్తె. హృతిక్‌కు దూరం అయ్యాక కొద్ది రోజుల నుంచి సుసానే మ‌రో వ్య‌క్తితో ఎఫైర్ కొన‌సాగిస్తోంది. ఆమె అధికారికంగానే త‌న ప్రేమ‌బంధాన్ని బ‌హిరంగ ప‌రుస్తోంది. త‌న మాజీ భార్య రెండో పెళ్లి దిశ‌గా అడుగులు వేస్తుండ‌డంతో ఇప్పుడు హృతిక్ కూడా అదే రూట్లో వెళుతున్నాడు.

హృతిక్ కొత్త ప్రియురాలు పేరు స‌బా అజాద్. న‌టి, థియేట‌ర్ డైరెక్ట‌ర్. ఆమె వ‌య‌స్సు 31. హృతిక్‌తో పోలిస్తే ఆమె 17 ఏళ్లు చిన్న‌ది. వ‌య‌స్సులో వీరి మ‌ధ్య చాలా అంత‌రం ఉంది. అయితే ఆమెకు ఇంకా వివాహం కాలేదు. కొద్ది రోజులుగా వీరు డేటింగుల్లో మునిగి తేలుతున్నారు. ఇంకో విశేషం ఏంటంటే ఇటీవ‌ల స‌బా విష‌యంలో హృతిక్ మాజీ భార్య సుసానే కూడా స్పందించింది.

ఓ సినిమా స‌బా న‌ట‌న‌ను ప్ర‌శంసిస్తూ కామెంట్ చేసింది. ఇక తాజాగా స‌బా, హృతిక్ ఫ్యామిలీతో క‌లిసి దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో వీరి ప్రేమ బంధం పెళ్లి దిశ‌గా అడుగులు వేస్తోంద‌ని అంటున్నారు.

Share post:

Popular