ఈ నెల 10న జ‌గ‌న్‌తో మెగాస్టార్ భేటీ.. రాజ్య‌స‌భ క‌న్‌ఫార్మ్ మాట నిజం..!

ఏపీ సీఎం జ‌గ‌న్‌తో మెగాస్టార్ చిరంజీవి మ‌రోసారి భేటీ కానున్నారు. ఈ నెల 10వ తారీకున సీఎం జ‌గ‌న్‌.. చిరుకు అప్పాయింట్ మెంట్ ఇచ్చిన‌ట్టు తాడే ప‌ల్లి వ‌ర్గాలు తెలిపాయి. అయితే.. ఈ భేటీ ఎందుకు?  రీజ‌నేంటి? అనే అంశాలు చాలా ఆస‌క్తిగా మారా యి. ఎందుకంటే.. గ‌త నెల 13న భోగి పండుగ రోజు ముందు కూడా చిరంజీవి సీఎం తో భేటీ అయ్యారు. ప్ర‌త్యేక విమానంలో వ‌చ్చిన ఆయ‌న సీఎంతో క‌లిసి భోజ‌నం కూడా చేశారు. ఈ స‌మ‌యంలో త‌న‌కు సీఎం స‌తీమ‌ణి భారతి స్వ‌యంగా వ‌డ్డించార‌ని కూడా చిరు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. తాను సినిమా రంగం స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాన‌ని.. త్వ‌ర‌లోనే సానుకూల ఫ‌లితం వ‌స్తుంద‌ని అన్నారు.

అయితే.. ఆవెంట‌నే ఓ ఆంగ్ల మీడియాలో మాత్రం.. చిరంజీవి రాక వెనుక రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం ఉంద‌ని.. సీఎం జ‌గ‌న్ ఆయ‌న‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తున్నార‌ని.. సంచ‌ల‌న క‌థ‌నం పేర్కొంది. దీంతో ఒక్క‌సారిగా.. ఈ భేటీ తీవ్ర వివాదంగా మారింది. సినిమా స‌మ‌స్య‌ల ఒంక‌తో.. చిరు.. త‌న‌సొంత లాభం కోసం ప్ర‌య‌త్నించార‌ని.. సోష‌ల్ మీడియాలోనూ విమ‌ర్శ‌లువ చ్చాయి. అంతేకా దు.. ఇదే నిజ‌మైతే.. త‌న సోద‌రుడు ప‌వ‌న్ పార్టీకి కూడా దెబ్బేన‌ని.. విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో వెంట‌నే స్పందించిన చిరు.. తాను రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాన‌ని.. త‌న‌కు రాజ్య‌స‌భ‌పై ఆస‌క్తి లేద‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఇటు వైసీపీ నాయ‌కులు మౌనంగా ఉన్నారు.

కానీ, మంత్రి పేర్ని నాని మాత్రం.. చిరు-జ‌గ‌న్‌ల మ‌ద్య సినిమా సంగ‌తుల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌లేద‌ని.. అదే జ‌రిగి ఉంటే.. సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా ఉన్న తాను ముఖ్య‌పాత్ర పోషించి ఉండేవాడిని కాదా? అని ప్ర‌శ్నించారు. కేవ‌లం భోజ‌నం కోసమే చిరు.. వ‌చ్చార‌ని తేల్చేశారు. దీంతో చిరు-జ‌గ‌న్‌ల భేటీ వెనుక విష‌యం ఏంట‌నేది.. ఆస‌క్తిగా మారింది. ఇదిలావుంటే.. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ అద్య‌క్షుడు మంచు విష్ణు కూడా చిరు-జ‌గ‌న్‌ల భేటీపై ఆస‌క్తిగా స్పందించారు. వీరిద్ద‌రు.. సినిమా స‌మ‌స్య‌ల‌పై  చ‌ర్చించార‌ని తాను అనుకోవ‌డం లేద‌ని.. ప‌ర్స‌న‌ల్ విష‌యాలు చ‌ర్చించుకుని ఉంటార‌ని.. చెప్పారు. అంటే.. అటు మంత్రి, ఇటు మా అధ్య‌క్షుడు చెప్పిన దాన్ని బ‌ట్టి.. ఈ భేటీలో సినిమా విష‌యాలు లేవ‌ని న‌మ్మాల్సి ఉంటుంది.

స‌రే.. మ‌రోవైపు.. రేపు 10వ తారీకున మ‌రోసారి చిరు… జ‌గ‌న్ భేటీ అవుతున్నారు. మ‌రి సినిమా విష‌యాలు కాన‌ప్పుడు.. మ‌రోసారి ఎందుకు భేటీ అవుతున్నారు? అనేది ప్ర‌శ్న‌. ఒక‌వేళ సినిమా విష‌యాల‌పైనే చ‌ర్చ ఉంటే.. ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌ను కూడా చిరు తీసుకురావాలి క‌దా! మ‌రి అలా పెద్ద‌ల‌ను క‌లుపుకొని వ‌స్తారా?  లేదా? అనేది చూడాలి. ఇక‌, రాజ‌కీయంగా చూస్తే.. రాజ్య‌స‌భ సీట్ల భ‌ర్తీకి.. స‌మ‌యం చేరువ అయింది. ఈ నెల ఆఖ‌రులోగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ ఇస్తోంది. దీంతో పేర్ల‌ను ఖ‌రారు చేసుకోవాల్సిన బాధ్య‌త సీఎంపై ప‌డింది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి చిరుతో భేటీ అంటే.. ఆంగ్ల ప‌త్రిక క‌థ‌న‌మే.. నిజ‌మ‌వుతుందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.