బాల‌య్య పాన్ ఇండియా ప్లాన్స్ మామూలుగా లేవే..!

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కే సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అఖండ త‌ర్వాత బాల‌య్య న‌టిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఫ‌స్ట్ లుక్ కూడా ఇటీవ‌లే రిలీజ్ అయ్యింది. హై ఓల్టేజ్ యాక్ష‌న్ సినిమాగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సినిమా టైటిల్ ఫిక్స్ కాకపోయినా వీర సింహారెడ్డి, జై బాల‌య్య ఇలా ర‌క‌ర‌కాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి.

అఖండ‌తో బాల‌య్య‌కు జాతీయ స్థాయిలో మాస్ ఇమేజ్ వ‌చ్చింది. కేవ‌లం ఏపీ, తెలంగాణ‌లో మాత్ర‌మే కాకుండా అటు క‌ర్నాట‌క‌లోనూ భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇటు త‌మిళ్లో రిలీజ్ అయ్యి వార్త‌ల్లోకి ఎక్కింది. ఇక అమెరికాలో కూడా అఖండ గ‌ర్జ‌న మోగించేసింది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు బాల‌య్య ఇప్పుడు పాన్ ఇండియా మార్కట్ మీద కూడా వ్యూహాత్మ‌కంగా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నాడు.

మ‌లినేని గోపీచంద్ సినిమాను ఇత‌ర భాష‌ల్లో కూడా రిలీజ్ చేసేందుకు ముందు నుంచే పక్కా ప్లాన్‌తో వెళుతున్నాడు. అందుకే ఇత‌ర భాష‌ల‌కు ఎందిన న‌టీన‌టుల‌ను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తున్నాడు. అందుకే నేష‌న‌ల్ వైడ్ క్రేజ్ ఉన్న శృతీహాస‌న్ హీరోయిన్‌.. కోలీవుడ్ టాప్ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ మ‌రో కీల‌క పాత్ర‌.. అటు శాండ‌ల్‌వుడ్‌ క్రేజీ యాక్ట‌ర్‌ దునియా విజ‌య్ విల‌న్‌గా ఎంపిక‌య్యారు.

ఇక మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు లాల్ ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం తెలుగు సినిమాల‌కు ఇత‌ర భాష‌ల్లో క్రేజ్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య #NBK107 చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Share post:

Latest