నా పై అలా జరగటానికి కారణం సాయి పల్లవినే..శృతి సంచలన కామెంట్స్..?

స్టార్ డాటర్ కూతురు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం పెద్ద కొత్త విషయం ఏం కాదు. కానీ తండ్రి సపోర్ట్ లేకుండా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ను ఉపయోగించుకోకుండా..సినిమాల్లో సక్సెస్ కొట్టడం మాత్రం కొందరి హీరోయిన్ల కే సాధ్యమౌతుంది. ఆ లిస్ట్ లోకే వస్తుంది ఈ హాట్ బ్యూటి శృతి హాసన్. లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ కూతురిగా సిని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు..మొదట్లో తెలిసి తెలియక అన్ని సినిమాలకు సైన్ చేసుకుంటూ పోతూ.. బోలెడు ఫ్లాప్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత తప్పు తెలుసుకుని రూటు మార్చి సక్సెస్ కోట్టి కోంత కాలం టాప్ హీరోయిన్ల లిస్ట్ లో కొనసాగింది. ఆ తరువాత ప్రేమలో పెయిల్ అయ్యి కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ మళ్ళీ జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ..కొత్త బాయ్ ఫ్రేండ్ తో తెగ ఎంజాయ్ చేసేస్తుంది .

కాగా..సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు అభిమానులతో అప్పుడప్పుడు లైవ్ చిట్ చాట్ చేస్తుంది. రీసెంట్ గా కొంచెం సేపు నెటిజన్లతో ముచ్చటించిన అవిడ..హీరోయిన్ సాయి పల్లవి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో శృతి కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. మనందరికి తెలిసిందే సాయిపల్లవి నటించిన ప్రేమమ్ సినిమాని తెలుగులో డబ్ చేసారు. ఈ సినిమా మళయాలంలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కానీ తెలుగులో పెద్ద క్లిక్ అవ్వలేదు.

దీంతో అప్పట్లో అందరు శృతి హాసన్ ని ఐరెన్ లెగ్ అంటూ నెట్టింట ట్రోల్ చేశారు. సాయి పల్లవితో కంపేర్ చేస్తూ దారుణమైన కామెంట్స్ చేసారు. కొందరు సాయి పల్లవితో పోల్చుకొని శృతి హాసన్ పాత్రకు న్యాయం చేయలేదని తీవ్రంగా ట్రోల్ చేశారట. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికి ఆమె పై వచ్చినా కామెంట్స్ చూసి శృతి బాధపడ్డారట. కొన్నిరోజులు చాలా మూడీ గా ఉన్నారట. ఆ ట్రోల్స్ వల్ల చాలా బాధ పడాల్సి వచ్చిందని..ఆ తరువాత తనను తాను కంట్రోల్ చేసుకుని..సెట్ అయ్యానని శృతి హాసన్ బయటపెట్టింది. ప్రస్తుతం శృతి బాలయ్య గోపీచంద్ మల్లినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Share post:

Popular