ఆ కోరిక ఇంకా తీరలేదు..డైరెక్టర్ ను రిక్వెస్ట్ చేస్తున్న భర్తను వదిలేసిన హీరోయిన్..?

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లకు కొన్ని కలలు ఉంటాయి. బడా బడా స్టార్స్ పక్కన నటిస్తే పాపులారిటీ వస్తుందని, అందరు గుర్తిస్తారని..తద్వారా మనం లైఫ్ లో సెటిల్ అవ్వచ్చని ఆలోచిస్తుంటారు కొందరు ముద్దుగుమ్మలు. అలా ఆలోచించడం లో తప్పులేదు కదా..ఎవ్వరైన సరే కష్టపడేది నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికే. అది ఏ రంగంలోని వారైనా సరే . వాళ్లకు ఉన్న తెలివితేటలతో అయా రంగంలో ఎదగాలని చూస్తుంటారు.

అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో మొగుడిని వదిలేసిన ఓ హీరోయిన్..తన లైఫ్ లో సెటిల్ అవ్వడానికి తెగ ట్రై చేస్తుందట. అసలు మ్యాటర్ ఏమిటంటే.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కామెడీ డైరెక్టర్ మారుతి ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు అన్న వార్త నెట్టింట తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రభాస్ తన రెమ్యూనరేషన్ ని కూడా తగ్గించికున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాకి “రాజా డీలెక్స్” అనే పేరుని కూడా రిజిస్టర్ చేసిన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకోవడానికి హీరోయిన్ మెహ్రీన్ తెగ ట్రై చేస్తుందట. ఇదివరకే మెహ్రీన్-మారుతి కాంబినేషన్ల్ లో మహానుభావుడు, మంచి రోజులు వచ్చాయి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ టైంలో నే ఆయనతో మంచి ఫ్రెండ్ షిప్ బాండింగ్ ఏర్పడింది. ఇక ఈ చనువుతోనే ప్రభాస్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తుంది అంటూ ఓ వార్త సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. రెమ్యూనరేషన్ విషయంలో కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు అంటూ ఫ్రీగా చేయడానికి సిద్ధం అన్నట్లు చెప్పుకొచ్చిందట. ప్రభాస్ తో నటించాలని అనేది తన కోరిక అని..సెకండ్ హీరోయిన్ ఛాన్స్ అయినా పర్లేదు అంటూ తెగ కాల్స్ చేస్తుందట డైరెక్టర్ మారుతికి. మరి చూడాలి మారుతి ఆమె కోరికను తీరుస్తాడా లేదా అని..? కాగా , మెహ్రీన్ మాజీ సీఎం కొడుకుతో నిశ్చితార్ధం చేసుకుని..బ్రేకప్ చెప్పేసుకున్న సంగతి తెలిసిందే.

Share post:

Latest