ఆలూ లేదు చూలు లేదు.. కానీ!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే సంక్రాంతి బరిలో నుండి బయటకొచ్చిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా ఈసారి సంక్రాంతి బరిలో ఎలాగైనా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. కానీ మరోసారి దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్‌ను నిరవధికంగా వాయిదే వేయక తప్పలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే, ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే.

- Advertisement -

ఈ జాబితాలో సలార్, ఆదిపురుష్ లాంటి పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. అయితే వీటితో పాటు మహానటి ఫేం దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నట్లు గతంలోనే అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకు ప్రస్తుతానికి ‘ప్రాజెక్టు K’ అని చిత్ర యూనిట్ టైటిల్ పెట్టింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలే కాలేదు కానీ.. అప్పుడే ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘ప్రాజెక్ట్ K’ చిత్రాన్ని 2023 వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీగా ఉన్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కించేందుకు రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అత్యద్భుతంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోండగా, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా అశ్వినీ దత్ ప్రొడ్యూస్ చేయనుండటంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమాను నిజంగానే 2023 వేసవిలో రిలీజ్ చేస్తారా లేరా అనేది చూడాల్సి ఉంది.

Share post:

Popular