టీవీలోనూ ఆదరణ దక్కలేదు.. పాపం సిద్ధార్థ్, శర్వా.. అయ్యో కంగనా..

ఒకప్పుడు వెలుగు వెలుగిన చాలా మంది సినీ తారలు.. ఆ తర్వాత నెమ్మదిగా ఫేడౌట్ అవుతారు. తాజాగా ఇదే కోవలోకి వచ్చాడు హీరో సిద్ధార్థ్. ఒకప్పుడు టాలీవుడ్ ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. లవర్ బాయ్ గా ఇక్కడి జనాలను బాగా ఆకట్టుకున్నాడు కూడా. నెమ్మదిగా తను కనిపించడం మానేశాడు. కేవలం తమిళ సినిమా పరిశ్రమకే పరిమితం అయ్యాడు. తెలుగులో హిట్ లేక చాలా రోజులు అయ్యింది కూడా. కొద్ది రోజుల క్రితం శర్వానంద్ తో కలిసి మహాసముద్రం సినిమా చేశాడు. దరిద్రం ఏంటంటే.. ఆయన గ్రహణం శర్వానంద్ కు కూడా పట్టింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అదితిరావు హైదరీ, అనూ ఇమ్మన్యుయేట్, శర్వానంద్, సిద్ధార్థ్ నటీనటులు ఫర్వాలేదు. పాయల్ రాజ్ పుత్ చేత ఓ ఐటెం సాంగ్ కూడా చేయించారు.

- Advertisement -

వాస్తవానికి ఈ సినిమా థియేటర్లలో బాగా ఆడలేదు. అవే సినిమాలు టీవీలో లేదంటే ఓటీటీలో వస్తే జనాలు బాగానే చూస్తారు. కానీ మహాసముద్రం మాత్రం అస్సలు జనాదరణ దక్కించుకోలేకపోయింది. ఈ సినిమా కేవలం 3.98 రేటింగ మాత్రమే దక్కించుకుంది. ఈ మధ్య ఇంత తక్కువ రేటింగ్ ఏ సినిమాకు కూడా రాలేదు. సిద్ధార్థ్ తో పాటు శర్వానంద్ కూడా ఘోరంగా ఈ సినిమా విషయంలో దెబ్బతిన్నాడు. వాస్తవానికి జెమిని టీవీకి సినిమాలు అమ్మితే డబ్బులు వస్తాయి కానీ.. జనాలు మాత్రం అంతగా చూడరు. దాన్ని జనాలు అంతగా చూడరు అనేది వాస్తవం. సినిమాలే కాదు.. పలు షోలు కూడా జనాదరణ లేక వెలవెలబోయాయి. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు.. తమన్నా మాస్టర్ చెఫ్ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.

అటు ఈటీవీలో తలైవి అనే సినిమా కూడా అత్యంత ఘోరం అని చెప్పుకోవచ్చు. ఈసినిమాకు జస్ట్ రెండున్నర రేటింగ్ వచ్చింది. కంగనాకు మరీ తలవంపులు వచ్చాయి ఈ సినిమాతో. ఈటీవీ కూడా ఈ సినిమాను టెలీకాస్ట్ చేసినందుకు సిగ్గుపడుతుండొచ్చు.

Share post:

Popular