అప్ కమింగ్ హీరోలకు అవకాశాలు ఇస్తున్న స్టార్ ప్రొడ్యూసర్లు?

భారీ బ్యాక్ గ్రౌండ్ నుండి చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే వారు పెద్దగా కష్టపడకున్న పర్వాలేదు. మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఇక భారీ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో తర్వాత సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఎలాగో ముందుకు వస్తారు. అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది స్టార్ ప్రొడ్యూసర్లు బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోల విషయంలోనే కాదు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి వచ్చి రాణించాలి అనుకుంటున్న ఎంతో మంది హీరోలకు సపోర్ట్ చేస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ లేని కొత్త హీరోలతో సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చి ఒక రకంగా లిఫ్ట్ ఇచ్చి వారి కెరియర్ ముందుకు నడిపించేందుకు తోడ్పాటు అందిస్తున్నారు అని చెప్పాలి.ఇక కొత్త టాలెంట్ ను గుర్తించడంలో అటు ప్రొడ్యూసర్లు ఎప్పుడూ ముందుంటున్నారు.

 

ఇలా ఇండస్ట్రీలోకి కొత్త గా ఎంట్రీ ఇస్తున్న హీరోలకి సహాయ సహకారాలు అందిస్తూ ఉండడంతో ఎంతో మంది హీరోలు పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతూ ఉండడం కూడా చూస్తున్నామ్. ఇక ఇలాంటి సినిమాలే మరికొన్ని తెరకెక్కుతున్నాయి.

జొన్నలగడ్డ సిద్ధూ హీరోగా డీజే టిల్లు అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఈ సినిమా కు స్టార్ హీరోల సినిమాలు నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థగా వ్యవహరించడం గమనార్హం. ఇక మరోవైపు అటు గీతా ఆర్ట్స్ కూడా కొత్త హీరోలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది. కేవలం ఆరు అడపాదడపా సినిమాలు మాత్రమే చేసిన కిరణ్ అబ్బవరం తో సినిమా చేస్తుంది గీత ఆర్ట్స్ లాంటి భారీ బ్యానర్. ఇటీవలే ఎస్ ఆర్ కళ్యాణమండపం అనే సినిమాతో కిరణ్ అబ్బవరం మంచి సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే గీతాఆర్ట్స్ ముందుకు వచ్చి అతనితో ‘వినరో భాగ్యము విష్ణు కథ ‘ అనే సినిమా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్ కి ఎంతో ప్లస్ కానుంది.

ఒకవైపు పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తూనే మరోవైపు కొత్త హీరోలకు కూడా అండగా నిలబడుతుంది మైత్రి మూవీ మేకర్స్. సుధీర్ బాబు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాను నిర్మిస్తుంది మైత్రి మూవీ మేకర్స్. ఇక మరో బిగ్ బ్యానర్ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ విశ్వక్సేన్ తో కలిసి ‘ఓరి దేవుడా’ అనే ఒక నిర్మిస్తూ ఉండడం గమనార్హం.

Share post:

Latest