చిరంజీవి వెనుక దాగి ఉన్న మీకు తెలియన వ్యాపార ప్రపంచం ఇదేనా..?

చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా సమస్య వస్తే ఆదుకునే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తన సినిమాల ద్వారా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా మెగాస్టార్ గా ఆరు పదుల వయసు దాటినా కూడా యూత్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక చిరంజీవి చుట్టూ దాగి ఉన్న వ్యాపార సంస్థల గురించి మాట్లాడుకున్నట్లు అయితే.. ఒకవైపు చిరంజీవి సినీ ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా కొనసాగుతుండగానే.. అప్పట్లోనే సినీ ఇండస్ట్రీలో బాగా ఫామ్లో ఉన్న అల్లు రామలింగయ్య కూతురు సురేఖ ను వివాహం చేసుకుని, ఇంకా స్ట్రాంగ్ అయ్యారు. చిరంజీవి నటుడిగా ముందు వరుసలో కొన సాగుతూ ఉండగా.. ఇక అతని బావ అల్లు అరవింద్ నిర్మాతగా రాణిస్తున్నారు. ఇంకా బాగా చెప్పాలంటే చిత్రసీమను ఏలుతున్న నిర్మాతలలో అల్లు అరవింద్ కు మొదటి స్థానం ఏర్పడుతుంది.

ఇక ఇలా వీరిద్దరూ మంచి ఫామ్లో ఉండగానే వీరి కుటుంబ సభ్యుల నుంచి వారసులు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక చిరంజీవి కొడుకు రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నప్పుడే.. ఒక వ్యాపార ప్రపంచానికి దగ్గరవుతూ రామ్ చరణ్ ను ఉపాసన కిచ్చి వివాహం చేశారు మెగాస్టార్. వివాహమైన మొదట్లో ఎవరీ ఉపాసన.ఎవరు ఈమె పేరు వినలేదు అనుకున్నారు. అమ్మాయి చూడడానికి అంతంత మాత్రమే ఉన్నా చిరంజీవి ఫ్యామిలీ ఎలా చేసుకుంది అనే వార్తలు వినిపించాయి.

ఇక అందరికీ షాక్ ఇస్తూ ఎన్నో వేల కోట్లు ఉన్న ప్రతాప్ రెడ్డి మనవరాలు అని తేలింది.ఇక అంతేకాకుండా ప్రముఖ వ్యాపారవేత్త..G.V.K. తో కూడా సంబంధాలు ఉన్నాయట. అది ఎలాగంటే ఉపాసన అమ్మ కు ఒక సోదరి కూడా ఉన్నది. ఆమె పేరే సంగీత రెడ్డి. ఈమె భర్త చేవెళ్ల మాజీ ఎంపీ.. విశ్వేశ్వర్ రెడ్డి. ఇక వీరిద్దరి ముద్దుల కుమారుడు.. ఆనంద్ రెడ్డి వివాహం చేసుకుంది.. ఎవర్నో తెలుసా G.V.K. సంస్థల అధినేత జీ.వి.కృష్ణారెడ్డి కుమార్తె అయిన..షాలిని రెడ్డి కూతురు శ్రియా భూపాల్. ఈమె మొదట నాగార్జున కుమారుడు అఖిల్ కి ఇచ్చి వివాహం చేయాలని చూశారు. ఇక ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది. అలా జీవీకే ఫ్యామిలీ చిరంజీవికి దగ్గర అయింది. ఇక అంతే కాకుండా.. ప్రముఖ వ్యాపారవేత్త..mlc t. సుబ్బిరామిరెడ్డి కూడా చిరంజీవికి దగ్గర వాడే.. ఇక చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కు కూడా ట్రూజెడ్ అనే వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత కొణిదెల అని ప్రొడక్షన్ బ్యానర్ లో కూడా స్థాపించారు. ఇలా ఎవరికి తెలియని వ్యాపార ప్రపంచాన్ని మెయింటెన్ చేస్తున్నాడు చిరంజీవి.

Share post:

Popular