ఊ అంటావా సాంగ్.. అసలు సీక్రెట్ బయట పెట్టిన సమంత?

ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్హిట్ అయింది. ఏకంగా భారీ వసూళ్లు కూడా సాధించింది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటిటీలో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ రష్మిక మందన నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇది పక్కన పెడితే సినిమాకు మరింత ప్లస్ పాయింట్ గా మారింది సమంత ఐటం సాంగ్. ఇక ఎంతో మంది ప్రేక్షకులు సమంత ఐటమ్ సాంగ్ చూడటానికే పుష్ప సినిమా కూడా వచ్చారు.

- Advertisement -

 

తన కెరియర్ లో ఇప్పటివరకు ఎప్పుడూ చేయనంత హాట్ ఐటమ్ సాంగ్ ని పుష్ప సినిమాలో చేసింది సమంత. ఊ అంటావా ఉహూ అంటావా అని ఐటమ్ సాంగ్ తో తెలుగు ప్రేక్షకులందరికీ మత్తెక్కించింది సమంత. ఇక ఈ పాట సినిమాకు ప్లస్ పాయింట్ గా మారడమే కాదు సినిమా మొత్తంలో హైలెట్గా నిలిచింది. ఇక ఈ పాటలో సమంత తప్ప ఇంకెవరు సూట్ కారేమో అనేంతలా సమంత తన అందంతో కోర చూపుల తో మతి పోగొట్టింది సమంత. ఇక కొంతమంది సమంత అద్భుతంగా చేసింది అని ప్రశంసలు కురిపిస్తే మరికొంతమంది సమంత ఇలా చేయడం ఏంటి అంటూ విమర్శలు కూడా చేశారు.

ఇకపోతే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడం పై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పుష్ప సినిమాలో నేను స్పెషల్ సాంగ్ చేయడానికి కారణం ఉంది. అల్లు అర్జున్ సుకుమార్ నా దగ్గరికి వచ్చి ఈ సాంగ్ గురించి చెప్పినప్పుడు నేను అంగీకరించలేదు. ఇలాంటి సాంగ్ చేయడానికి ఎంతో భయపడిపోయాను. ఇక ఈ సాంగ్ చేయాలా వద్దా అని ఎన్నోసార్లు నాకు నేను ఆలోచించుకున్నాను. అల్లు అర్జున్ నాకు అండగా నిలబడి ఈ సాంగ్ చేస్తే ఎంతగానో గుర్తింపు వస్తుంది అని నిన్ను నువ్వు ప్రూఫ్ చేసుకునేందుకు మరో అవకాశం వచ్చింది అంటూ చెప్పడంతో.. ఒక నటి అయిన తర్వాత ఎలాంటి రోల్స్ అయినా చేయాలని డిసైడ్ అయ్యి ఇక ఈ పాటకు ఓకే చెప్పేశా అంటూ సమంత చెప్పుకొచ్చింది. బన్నీ చెప్పకపోయి ఉంటే ఐటెం సాంగ్ లో నటించకపోయే దాన్ని అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Popular