హీరో కథ నితిన్ కోసం రాశాడా? అశోక్ ఎలా ఎంట్రీ ఇచ్చాడు?

January 13, 2022 at 3:01 pm

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు వచ్చాడు. కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. తను నటించిన తాజా సినిమా హీరో సంక్రాంతి బరిలో నిలిచింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 15న విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమాలో పలువురు సీనియర్ నటులు ఆయా పాత్రలు పోషిస్తున్నారు. ప్రధానంగా జగపతి బాబు, నరేశ్, కోట శ్రీనివాసరావు, వెన్నెల కిశోర్, సత్య, బ్రహ్మాజీ కీరోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమా కోసం భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతుంది మూవీ యూనిట్. అటు ఈ సినిమాకు మహేష్ అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా వచ్చిన ట్రైలర్ సైతం జనాలను బాగా ఆకట్టుకుంటుంది. హీరో మాటలు, ఫైట్లు, హీరోయిన్ అందాలు తెగ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. వాస్తవానికి దర్శకుడు ఈ సినిమా కథను నితిన్ ను బేస్ చేసుకుని రాశాడట. అయితే అనివార్య కారణాల మూలంగా నితిన్ ఈ సినిమాలో నటించలేదట. దీంతో తను గల్లాతో కలిసి ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అశంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

మొత్తానికి ఏం జరిగిందో తెలియదు కానీ అశోక్ హీరోగా మహేష్ బాబు సోదరి సొంత బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. అయితే గతంలో నితిన్ హీరోగా హీరో అనే టైటిల్ తోనే సినిమా తీశారు. అప్పుడు ఆ సినిమా ఆయనకు పెద్ద దెబ్బ కొట్టింది. దీంతో ఈ సినిమా నుంచి నితిన్ తప్పుకున్నట్లు తెలిసింది. లేదంటే డేట్స్ కుదరక చేయలేకపోయాడా? అనేది బయటకు తెలియదు. ఏది ఏమైనా కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి వచ్చాడు. అయితే తన తొలి మూవీ ఫలితం ఆధారంగానే ఆయన కెరీర్ ముందుకు సాగే అవకాశం ఉంటుంది.

హీరో కథ నితిన్ కోసం రాశాడా? అశోక్ ఎలా ఎంట్రీ ఇచ్చాడు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts