టాలీవుడ్ లో.. తండ్రి కొడుకులతో నటించిన హీరోయిన్లు వీళ్ళే?

సాదారణంగా చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరోయిన్లు ఏ హీరో తో నటించిన పర్ఫెక్ట్ జోడి అని పిలుచుకుంటూ ఉంటారు. ఇలా ఇప్పటి వరకూ ఎంతో మంది హీరోయిన్లు ఒకవైపు సీనియర్ హీరో గా కొనసాగుతున్న తండ్రితో మరోవైపు జూనియర్ హీరోగా కొనసాగుతున్న కొడుకు తో కూడా సినిమాలు చేసి హిట్ అందుకున్న హీరోయిన్లు ఉన్నారు. అలాంటి హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం.

శ్రీదేవి : సినీ ఇండస్ట్రీలో అతిలోకసుందరి గా పేరు సంపాదించుకున్న శ్రీదేవి తోనే ఇలా తండ్రీ కొడుకుల తో నటించడం మొదలయ్యింది. ఒకప్పుడు ఏఎన్నార్ సరసన నటించిన శ్రీదేవి ఆ తర్వాత నాగార్జున సరసన కూడా నటించింది. ఇలా తండ్రి కొడుకుల తో నటించిన శ్రీదేవి అప్పట్లో ఓ సరికొత్త రికార్డ్ సృష్టించింది.

కాజల్ అగర్వాల్ : రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాలో చరణ్ తో రొమాన్స్ చేసిన కాజల్ అగర్వాల్.. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 లో మెగాస్టార్ తో కలిసి నటించింది. ఇద్దరికీ పర్ఫెక్ట్ జోడి అనిపించుకుంది.

రకుల్ ప్రీత్ సింగ్ : నాగ చైతన్య సరసన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా లో హీరోయిన్ గా నటించిన రకుల్.. ఇక ఆ తర్వాత తండ్రి నాగార్జున హీరోగా తెరకెక్కిన మన్మధుడు 2 సినిమాలో కూడా రొమాన్స్ చేసింది. ఏకంగా లిప్ లాక్ సీన్లలో కూడా నటించేసింది ఈ ముద్దుగుమ్మ.

శ్రీయ : నందమూరి బాలకృష్ణ తో చెన్నకేశవరెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రేయ.. ఇక ఎన్టీఆర్ పక్కన నా అల్లుడు సినిమాలో నటించడం గమనార్హం.

తమన్నా : రామ్ చరణ్ తో రచ్చ సినిమాలో నటించిన తమన్నా ఇక మెగాస్టార్ చిరంజీవి తో సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించింది. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో కూడా అలరించింది. మరోవైపు బన్నీ తో బద్రీనాథ్ చేసి మెగాహీరోలు అందరినీ కవర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

జెనీలియా : విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సుభాష్ చంద్రబోస్ సినిమాలో వెంకటేష్ సరసన నటించింది జెనీలియా. ఇక ఆ తర్వాత దగ్గుబాటి వారసుడు రానా సరసన నా ఇష్టం అనే సినిమాలో రానా తో రొమాన్స్ చేసింది.

అనుష్క శెట్టి : వెంకటేష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చింతకాయల రవి సినిమాలో వెంకటేష్ పక్కన హీరోయిన్గా నటించిన అనుష్క.. రుద్రమదేవి సినిమాలో రానా తో రొమాన్స్ చేసి ఆశ్చర్యపరిచింది.

Share post:

Latest