దేశంలో కొత్త రికార్డు క్రియేటివ్ చేసిన మహేష్ బాబు

టాలీవుడ్ లో ఒక 10 ఇయర్స్ వరకు స్టార్ హీరోల సినిమాలు చేసిన వసూళ్లు మరియు యాభై .వంద రోజులు ఎన్ని థియేటర్లు రెండు వందల రోజులు ఎన్ని థియేటర్లో ఆడింది అనే రికార్డులను లెక్క వేసుకునే వారు.అభిమానులు ,ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో మాత్రం ప్రతి ఒక్కటి రికార్డుగా చెప్పుకుంటున్నారు.ఈమద్య కాలంలో సోషల్ మీడియా రికార్డుల గురించి ప్రముఖంగా సినీ అభిమానులు మధ్య చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలోటాలీవుడ్ హీరోల్లో ఏ హీరోకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు అనే విషయం మొదలుకుని ఏ హీరో గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు.. ఏ హీరోకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువగా రీచ్ అవుతున్నాయి.. ఎక్కువగా ట్వీట్స్ పడ్డ హ్యాష్ ట్యాగ్స్ ఏంటీ అంటూ రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఒక్కో హీరో అభిమాని ఒక్కో విధంగా తమ హీరో రికార్డును దక్కించుకున్నాడు అంటూ చెప్పడం జరుగుతుంది.

తాజాగా మహేష్ బాబు అభిమానులు ఒక ఇంట్రెస్టింగ్ రికార్డును న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు ..ఇప్పటి వరకు దేశంలో ఏ ఇండియన్ స్టార్ హీరో కాని.. ఏ ఇండియన్ సినిమా సెలబ్రెటీ కాని ట్విట్టర్ లో దక్కించుకోలేని రికార్డును మహేష్ బాబు దక్కించుకున్నాడు అంటున్నారు. ఆ రికార్డు ఏంటీ అంటే మహేష్ బాబు చేసిన ట్వీట్స్ లో ఏకంగా 30 ట్వీట్స్ కు లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. ఇతర ఏ సెలబ్రెటీకి కాని.. హీరోకు కాని ఈ స్థాయి లో లైక్స్ రాలేదు. ఇతర హీరోల్లో వేలల్లోనే ఉన్నాయంట,మహేష్ ట్వీట్ కు మాత్రమే లక్ష అంతకు మించి లైక్స్ వచ్చాయి. కనుక ఈ విషయంలో మా మహేష్ బాబు ఆల్ ఇండియా రికార్డును దక్కించుకున్నాడు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు క్రేజ్ కు ఆయన సోషల్ మీడియా స్టామినాకు అద్దం పడుతుంది అంటున్నారు ప్రిన్స్ అభిమానులు .

మహేష్ పాన్ ఇండియా సినిమా ఒక్కటి కూడా చేయకుండా బాలీవుడ్ హీరోల రేంజ్ లో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కలిగి ఉన్న సౌత్ స్టార్ మహేష్ బాబు అనడంలో సందేహం లేదు. మహేష్ బాబు ఈ ఏడాది సమ్మర్ లో సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. దీని తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా ఉంటుంది. ప్రస్తుతం దుబాయిలో ఫ్యామిలీతో హాలీడేను ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు తిరిగి వచ్చిన తర్వాత సర్కారు వారి పాట చివరి షెడ్యూల్ లో పాల్గొంటాడు. త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో కూడా సినిమా ను మహేష్ బాబు చేయాల్సి ఉంది.