తగ్గేదేలే అంటున్న టాలీవుడ్ హీరోలు.. అసలు భయం అనేదే లేదా

?

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయ్. అయితే ఇలా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి తీవ్రంగా ఇబ్బందుల్లో కూరుకు పోయిన రంగం ఏదైనా ఉంది అంటే అది చిత్ర పరిశ్రమ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా సినీ పరిశ్రమలో ఎప్పుడూ వరుస షూటింగ్ లు, బాక్సాఫీస్ వద్ద సినిమాల విడుదల ఆ సందడి ఒక వేరేలా ఉండే.ది కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య అతికష్టం మీద షూటింగులు జరుగుతున్నాయి. ఎంతో కష్టపడి షూటింగ్ పూర్తి చేసిన విడుదల తేది సమయంలో మళ్లీ కరోనా వైరస్ కాలు అడ్డుపెడుతున్న పరిస్థితులు వస్తున్నాయి.

దీంతో చిత్రపరిశ్రమలో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. అయితే మొదటిదశ కరోనా వైరస్ సమయంలో అందరూ షూటింగ్లు నిర్వహించాలంటే భయపడిపోయారు. ఆ తర్వాత రెండవ దశ సమయంలో కొంతమంది షూటింగ్ లను క్యాన్సిల్ చేసుకుంటే మరికొంత మంది హీరోలు మాత్రం తగిన జాగ్రత్తలు మధ్య షూటింగ్ లు నిర్వహించడం లాంటివి చేశారు. ఇప్పుడు మూడవ దశ ముంచుకొస్తుంది. దేశంలో రోజూ లక్షల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కానీ మునుపటిలా కరోనా వైరస్ ప్రభావం చూపించడంలేదు.. అందరికీ అవగాహన రావడంతో ఇంట్లో కూర్చొని మందులు వేసుకొని వైరస్ నుంచి కోలుకుంటున్నారు.

 

అదే సమయంలో అటు టాలీవుడ్ హీరోలలో కూడా భయం ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పాలి. సీనియర్ హీరోల దగ్గర నుంచి జూనియర్ హీరోల వరకూ వరుసగా సినిమా షూటింగులతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద హీరోలు కూడా తమ సినిమాల షూటింగ్ ప్రారంభించి దూసుకుపోతున్నారు. ఇక రవితేజ వెంకటేష్ నాగార్జున కూడా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. మరోవైపు రామ్ చరణ్ శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక నానీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస షూటింగులతో ఫుల్ బిజీగా మారిపోయాడు. అయితే షూటింగ్ స్పాట్లో ప్రత్యేకంగా ఒక డాక్టరు నియమించుకొని ఎవరికైనా కాస్త అస్వస్థతగా ఉన్నా లేదా వైరస్ లక్షణాలు ఉన్న వారికి వెంటనే పరీక్షలు నిర్వహించడం కరోనా వైరస్ ఉంది అని తేలితే వారిని ఇంటికి పంపించి ఇక తగ్గిన తర్వాత పనిలోకి తీసుకోవడం లాంటివి చేస్తున్నారట.