శ్రీనువైట్ల డైరెక్షన్ చేసిన ఆ మూవీ ‘రాడ్డుకే రాడ్’ అంటున్న రవితేజ

టాలీవుడ్లో సినీ అభిమానులతో మాస్ రాజా అని పిలుసుకుంటున్న రవితేజ తనకంటూ నటనలో ప్రత్యకమైన స్థానం ఏర్పాటు చేసుకొన్నాడు .అతను సినీ కేరీర్లో బ్లాక్ బస్టర్స్ మరియు ఘోరమైన ప్లాప్ కూడా ఉన్నాయి.ప్లాప్ స్టోరీ సినిమాలను రవితేజ ఎలా ఒప్పుకున్నాడో అర్థం కాదు. అన్ని సినిమాల ఫలితాలనూ ముందుగా అంచనా వేయడం కష్టం, కొన్నిసార్లు మంచి సినిమాలకు కూడా రిజల్ట్ తేడా కొట్టేస్తుంటుంది. కానీ కొన్ని సినిమాల ఫలితం ఏంటో ఫిలిం మేకింగ్ లో తెలిసిపోతుంటుంది. ఆలా వచ్చిన ఆ సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులకు ఎలా చుక్కలు చూపించేస్తాయో సగటు ప్రేక్షకుడుగా అందరకి తెలిసిందే .

రవి తేజ కెరీర్ ఆరంభం నుంచి చివరి దాకా చూసుకుంటే డిజాస్టర్ సినిమాలు కొన్ని ఉన్నాయి .మాస్ రాజా కెరీర్లో అలాంటి డిజాస్టర్ ఒక సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోని’. తనకు నీకోసం, వెంకీ, దుబాయ్ శీను లాంటి హిట్లు ఇచ్చాడు శ్రీను వైట్ల .తరువాత కాలంలో శ్రీను వైట్ల వరుస డిజాస్టర్లతో స్లంప్‌లో ఉన్న అతడికి రవితేజ ఒక్క ఛాన్స్ ఇచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ప్రొడక్షన్లో భారీ బడ్జెట్లో ఈ సినిమా తీశారు.

కానీ రవి తేజ కెరీర్లో అది పెద్ద డిజాస్టర్ అయింది.అసలు విషయానికి వస్తే ఆ సినిమా గురించి తాజాగా బాలకృష్ణ ఆహాలో హోస్ట్‌గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షోలో రవితేజ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రవితేజ యుఎస్‌లో ఉన్న ఒక ఫొటోను బాలయ్య ఈ షోలో స్క్రీన్ మీద డిస్‌ప్లే చేసి దాని గురించి చెప్పమని అడిగాడు. అది ఒక సినిమా షూటింగ్‌ టైంలో తీసిన ఫొటో అంటూ.. ఆ సినిమా గురించి ఊహించని వ్యాఖ్యలు చేశాడు రవితేజ. ‘‘ఈ ఫొటో అమెరికా తీసింది. ఒక కళాఖండం లాంటి సినిమా షూటింగ్ టైంలో. ఆ కళాఖండం పేరు తెలుసుకోవాలనుందా మీకు? అమర్ అక్బర్ ఆంటోని. అది పెద్ద కళాఖండం’’ అన్నాడు రవితేజ.

బాలకృష్ణ మాట్లాడుతూ రవి తేజాన్ని ఇందులో నువ్వు అమరా, అక్బరా, ఆంటోనీనా అని అడగ్గా.. ‘‘మూడూ.. ఆ సినిమా చూడలేదా మీరు’’ అన్నాడు రవితేజ. బాలయ్య చూడలేదని చెప్పగా.. ‘‘మీరేం మిస్సయిపోలేదు. చూడక్కర్లా’’ అన్నాడు మాస్ రాజా. రాడ్ రంబోలానా అని బాలయ్య అంటే.. మామూలు రాడ్ కాదు.. రాడ్డుకే రాడ్ అని రవితేజ ముగించాడు. సినిమా ఎంత డిజాస్టర్ అయినప్పటికీ.. ‘అమర్ అక్బర్ ఆంటోని’ గురించి మాస్ రాజా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడని బాలకృష్ణ మరియు అక్కడ ఉన్న ,చూస్తున్న ప్రేక్షకులు కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు. దీన్ని బట్టే ఆ సినిమా ఫలితం మాస్ రాజాను ఎంత డిస్టర్బ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.