స్టార్ హీరోస్ బ్యాడ్ హాబిట్స్.. మార్చుకోకపోతే కష్టాలు తప్పవు మరీ!

సినిమా హీరోలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రేక్షకులు సినిమా హీరో లకు సంబంధించిన కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎప్పుడూ సోషల్ మీడియాలో వెతుకుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోలకు ఉండే అలవాట్లు గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అందరిలాగానే సినిమా హీరోలు కూడా కొన్ని బాడ్ హాబిట్స్ ఉంటాయి. ఎందుకంటే సినిమా హీరోలు కూడా మనలాంటి సాధారణ మనుషులే కదా.. కానీ సినిమా హీరోలు వారి బ్యాడ్ హబ్బీట్స్ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎంతోమంది అభిమానులు హీరోలు చేసిందే చేస్తూ ఉంటారు కాబట్టి. మరి మన స్టార్ హీరోలు లో ఉన్నా బాడ్ హాబిట్స్ ఏంటి మరి ఇప్పుడు తెలుసుకుందాం.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డా ఉన్న రజినీకాంత్ సినిమాల్లో ఎంత స్టార్ హీరో అయినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం ఎంతో సింప్లిసిటీ తో జీవిస్తూ ఉంటారు. రజనీకాంత్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న అతిపెద్ద బ్యాడ్ హ్యాబిడ్ సిగరెట్ తాగడం. ఈ విషయంపై రజినీకాంత్ ఎన్నోసార్లు ఓపెన్ అయ్యారు. సిగరెట్ తాగొద్దని సిగరెట్ అలవాటు ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాను అంటూ తన సొంత అనుభవాలను కూడా సూపర్ సార్ బయట పెట్టారు. ఇప్పటికి కూడా రజిని అప్పుడప్పుడూ సిగరెట్ కాలుస్తూ ఉంటారట.

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా సిగరెట్ తాగే అలవాటు ఉందని అప్పట్లో ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి. కానీ ఇందులో నిజమెంత అనేది మాత్రం ఎవరికీ తెలియదు. అల్లు అర్జున్ కూడా ఇప్పటివరకు ఎప్పుడూ స్పందించలేదు. ముఖ్యంగా తన బ్యాడ్ హ్యాబిట్ ల గురించి అల్లుఅర్జున్ బయటకు చెప్పడానికి అసలు ఇష్టపడడు.

విజయ్ దేవరకొండ : స్వయంకృషితో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా తో ఎంతగానో క్రేజ్ సంపాదించాడు. ఇప్పుడు లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారపోతున్నాడు విజయ్ దేవరకొండ. అయితే విజయ్ దేవరకొండకు సిగరెట్ కాల్చే అలవాటు ఉందట. కానీ ఆ తర్వాత మాత్రం ఆ అలవాటును పూర్తిగా మానేసాడటా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.

మహేష్ బాబు : టాలీవుడ్ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు ఎప్పుడూ సింప్లిసిటీ కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు. మంచితనానికి చిరునామాగా కూడా ఉంటారు. అయితే మహేష్ బాబు అప్పట్లో చైన్ స్మోకింగ్ చేసేవారు అంటూ సోషల్ మీడియాలో టాక్ ఉంది. ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు..

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ కి రాష్ డ్రైవింగ్ చేసే అలవాటు ఉందట. కానీ ఆ తర్వాత అలవాటును మానుకున్నాడటా విజయ్. కోలీవుడ్ హీరో సూర్య ప్రతిరోజు 10 డ్రెస్సులు మార్చే బ్యాడ్ హాబిట్ కలిగి ఉన్నాడట. ఇక మరో హీరో ధనుష్ శాకాహారి కావడం అతనికి ఇబ్బందులకు గురించేసిందట. ఎందుకంటే విదేశాలకు వెళ్ళినప్పుడు ఫుడ్ హ్యాబిట్ తో బాధ పడుతూ ఉంతాడట.

Share post:

Latest