స్టార్ హీరో రేంజ్ లో.. నటుడు నరేష్ లగ్జరీ క్యారీ వ్యాన్?

సినిమా షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ దొరికిందంటే చాలు సినీ సెలబ్రిటీలు అందరూ కూడా తమ తమ క్యారీ వ్యాన్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. లేదా ఇక సినిమా షూటింగ్ కి ముందు మేకప్ వేసుకోవడానికి కూడా క్యారీ వాన్ ఉపయోగిస్తూ ఉంటారు.. అందుకే తాము ఉపయోగించే క్యారీ వ్యాన్ ప్రత్యేకంగా సౌకర్యవంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు భారీ ఖర్చుతో స్పెషల్ క్యారీ వాన్ కొనుక్కుంటున్నారు అన్న విషయం తెలిసిందే. చిన్న చిన్న ఆర్టిస్గ్ లకు అయితే షూటింగ్ లో అందరూ ఉపయోగించే క్యారీ వాళ్ళువాన్ లను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ స్టార్ హీరోలు సొంతంగా లగ్జరీ క్యారీ వాన్ లను తెచ్చుకోవడం చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే గతంలో టాలీవుడ్ ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ క్యారీ వ్యాన్ కోసం కోట్లు ఖర్చు పెట్టడం తో ఇక అల్లు అర్జున్ క్యారీ వ్యాన్ కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. దాదాపుగా మూడు కోట్లు పెట్టి ఒక క్యారీ వ్యాన్ కొనుగోలు చేసారు అల్లు అర్జున్. ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్న నరేష్ లగ్జరీ క్యారీ వ్యాన్ కొనుగోలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం ఏ హీరో సినిమాలో చూసిన కీలక పాత్రల్లో నరేష్ కనిపిస్తున్నాడు. అయితే కరోనా సమయంలో ఇతర నటులు వాడిన క్యారీ వ్యాన్ తో ప్రమాదం ఉందని భావించి ఈ కొత్త క్యారీ వ్యాన్ కొనుగోలు చేశారట. ఇక ఇప్పుడు నరేష్ కొనుగోలు చేసిన క్యారీ వ్యాన్ గురించి టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.

ఇక ఈ క్యారీ వ్యాన్ తన అభిరుచులకు తగ్గట్లుగా మాడిఫై చేయించుకున్నారట నరేష్. క్యారీ వ్యాన్ గురించి నరేష్ మాట్లాడుతూ నటీనటులకు క్యారీ వ్యాన్ అనేది మరో ఇల్లు లాంటిది. నా జీవితంలో 70 శాతం సమయం ఈ క్యారీ వ్యాన్ లోనే గడిచిపోతూ ఉంటుంది. అందుకే కార్ల కోసం పెట్టే ఖర్చుతో మంచి క్యారీ వ్యాన్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా ప్రస్తుత సమయంలో వేరే వాళ్ల క్యారీ వ్యాన్ లో ఉండటం ఉత్తమం కాదు అని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇక నా అభిరుచులకు తగ్గట్లుగానే క్యారీ వ్యాన్ కొనుగోలు చేశాను అంటూ నరేష్ చెప్పుకొచ్చాడు.

Share post:

Popular