ఎన్టీఆర్ అభిమాన కథా నాయకి ఎవరో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న తార శాంతకుమారి. ఈమె ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. నాలుగు ఏండ్లు చిన్నవాడు అయిన ఏఎన్నార్ తో మాయాలోకం సినిమాలో హీరోయిన్ గా చేసింది. అదే నాగేశ్వర్ రావుకు తల్లిగానూ నటించి మెప్పించింది. అటు తన కంటే 8 సంవత్సరాలు చిన్నవాడు అయిన గుమ్మడికి ఓ సినిమాలో చెల్లెలుగా నటించింది. ఆ తర్వాత అదే గుమ్మడితో కలిసి పలు సినిమాల్లో భార్య నటించి మెప్పించింది.

- Advertisement -

తెలుగులో తొలితరం హీరోయిన్ శాంత కుమారి. ఆమె నటి మాత్రమే కాదు. మంచి గాయని కూడా. మాయా బజార్ సినిమాలో శశిరేఖగా నటించి మెప్పించింది. ఆమె నటనకు అప్పటి మేటి దర్శకుడు పి పుల్లయ్య ముగ్ధుడు అయ్యాడు. నెమ్మదిగా ఆమెను ఇష్టపడ్డాడు. వీరి పెళ్లికి పెద్దలు నో చెప్పారు. అయినా పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నారు. అప్పటి వరకు సుబ్బమ్మగా ఉన్న తన పేరును శాంత కుమారిగా మార్చాడు పుల్లయ్య. ఎన్టీఆర్, ఏఎన్నార్ తో కలిసి శాంత కుమారి ఎన్నో సినిమాలు చేశారు. తల్లిగా, వదినగా, భార్యగా వీరి సినిమాల్లో నటించింది.

ఎన్టీఆర్ కు శాంత కుమారి వాయిస్ అంటే ఎంతో ఇష్టం. ఆమె సెట్స్ లో కనిపిస్తే దగ్గరకు వెళ్లేవాడు. మీ అభిమాని వచ్చాడు. మీ పాట వినడానికి అని చెప్పేవాడు. ఆమె పాటలు పాడుతుంటే ఎదురుగా కూర్చుని వినేవాడు ఎన్టీఆర్. ఆమె చాలా సులభంగా పాటలు పాడేది. అందరూ అప్పట్లో ఎన్టీఆర్ ను అభిమానిస్తే.. తను మాత్రం శాంత కుమారిని అభిమానించేవాడు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన తల్లా? పెళ్లామా? అనే సినిమాలో ఎంతో మంచి పాటలను తన చేత పాడించుకున్నాడు. ఆమె సినిమా పాటలతో పాటు భక్తి పాటలను సైతం అద్భుతంగా పాడేది. అందుకే నటిగానే కాకుండా గాయని గా కూడా మంచి పేరు పొందింది శాంత కుమారి.

Share post:

Popular