సినిమా సినిమాకు రెబల్ స్టార్ ప్రభాస్ వేరియేషన్స్.. నా రూటే సెపరేట్!

రెబల్ స్టార్, గ్లోబల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ గా కొనసాగిన ప్రభాస్ బాహుబలి సినిమా తో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా అవతారమెత్తాడు. ఇక సాహో సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా కూడా వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోన్నదే ఉండటం గమనార్హం. అంతేకాదు ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో 300 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాల్లో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు ఉండడం గమనార్హం.

 

ఇక గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ ఎంచుకునే కథలు కూడా ఎంతో భిన్నంగా ఉంటున్నాయి అని చెప్పాలి. ప్రతి సినిమాలో తనను తాను కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రభాస్. ఇప్పటివరకు ప్రభాస్ సెలెక్ట్ చేసిన సినిమాలను చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఇంతకీ ప్రస్తుతం ప్రభాస్ కొత్త గా కనిపించబోయే క్రేజీ ప్రాజెక్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అర్జున్ రెడ్డి తో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన సందీప్ రెడ్డి వంగా తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ఓకే అయ్యింది. ఇక ఈ సినిమాలో సరికొత్తగా ఏకంగా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు ప్రభాస్. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీగానే అంచనాలు ఉన్నాయి. మరో వైపు కే జి ఎఫ్ తో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ దర్శకుడితో కూడా ప్రభాస్ సినిమా చేస్తున్నాడు.. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెట్రో స్టోరీగా రాబోతుందట. ఒకవైపు ఆర్మీ ఆఫీసర్ గా మరోవైపు గ్యాంగ్ స్టార్ గా కూడా కనిపించబోతున్నాడట ప్రభాస్.

 

ఇక వైవిధ్యమైన దర్శకుడు నాగ్ అశ్విన్ తో కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు గ్లోబల్ స్టార్ ప్రభాస్. సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టుగా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నెవర్ బిఫోర్ అనే క్యారెక్టర్ లో నటించబోతున్నాడట. ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది.

 

అన్నింటికిమించి ఏకంగా ఇప్పటివరకూ లవర్బాయ్ గా.. బాహుబలి లో ఒక దేశపు రాజు గా కనిపించిన ప్రభాస్ ఇక ఆది పురుష్ అనే సినిమాలో రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

 

క్యూట్ లవర్ బాయ్ లాగా కనిపిస్తూ ప్రేక్షకులందరినీ తన లుక్ తోనే ఆకర్షిస్తున్న సినిమా రాధేశ్యామ్. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లో ఇక అటు భవిష్యత్తు చెప్పే ప్రామిస్ట్ గా క్రేజీ పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నట్లు ఇప్పటికే దర్శకుడు రివీల్ చేశాడు. ఇలా గ్లోబల్ స్టార్ గా మారిపోయిన తర్వాత ఈ పాన్ ఇండియా హీరో తీసుకుంటన్న సినిమాలు ప్రేక్షకులకు కొత్త ప్రభాస్ను చూపించబోతున్నట్లు అని చెప్పాలి.

Share post:

Latest