ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ వెనుకున్న సెంటిమెంట్ ఇదేనా?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా కోసం యావత్ దేశం ఎదురు చూస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో బాగా ప్రచారం పొందుతుంది. జనాల ఆసక్తిని గుర్తించిన ఈ సినిమా యూనిట్ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాకు సంబంధించి ప్రతి విషయాన్ని ఫేర్ చేస్తుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రకటన ఉంది. మార్చి 18న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అయితే కరోనాతో పాటు ఇంకా ఏవైనా సమస్యలు ఎదరైతే మాత్రం సినిమా విడుదల తేదీ మార్చుతాం అని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఒక సినిమాకు రెండు రిలీజ్ డేట్లు ప్రకటించడం ఇదే తొలిసారి.

ఆర్ఆర్ఆర్ కు సంబంధించి రాజమౌళి రెండు రిలీజ్ డేట్లు ప్రకటించడం.. సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్ గా నిలిచింది. అయితే సినిమా యూనిట్ నిర్ణయం పట్ల ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. ఒక సినిమాకు ఇన్ని రిలీజ్ డేట్లు ఉంటాయా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అటు ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదల చేయాలని భావించడం వెనుక ఓ కారణం ఉందంటన్నారు నెటిజన్లు. గతంలో ఈ తేదీలో విడుదల అయిన చాలా సినిమాలు ఓ రేంజిలో విజయాన్ని అందుకున్నాయి. రికార్డుల మీద రికార్డులు సాధించిన సినిమాలు సైతం ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను అందుకున్నాయి కూడా.

ఇదే తేదీన ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు సినిమా, కైకాల సత్యనారాయణ నటించిన యమలీల, మహేష్ బాబు నటించిన పోకిరి, ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలు విడుదల అయ్యాయి. ఈ సినిమాలు అన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. అదే సెంటిమెంట్ ను రాజమౌళి ఫాలో అవుతున్నాడు. అయితే ఈ సినిమా ఏ రోజున విడుదల అవుతుందో? ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో? చూడాలి.