ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్‌.. మళ్లీ వాయిదా..

ఊహించినట్టుగానే ‘రాధేశ్యామ్‌’ ప్రేక్షకులకు భారీ షాక్ ఇచ్చింది.యు.వి.క్రియేషన్స్ నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది . ప్రస్తుత కరోనా విజృభించడం తో ఈ సినిమా విడుదలని వాయిదా వేస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ సారి సంక్రాంతి పండక్కి పెద్ద సినిమాలతో సందడి చేయబోతున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది.

పాన్ ఇండియా చిత్రం త్రిబుల్ ఆర్ 7న జనవరి వస్తుందనుకున్న చిత్రం వాయిదా పడింది. మొదట్లో మూవీమేకర్స్ యు.వి.క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఏదేమైనా ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వడం ఖాయమని ప్రకటించడంతో ప్రకటించడంతో సినీ ప్రేక్షకులు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు కానీ ఈరోజు యు.వి.క్రియేషన్స్ చేసిన ట్వీట్ తో ప్రేక్షకులను నిరాశకు గురయ్యారు.

మొదటి నుండి రాధేశ్యామ్ టీం ప్రమోషన్ కార్యక్రమాలు కానీ ఇంటర్వూస్ కానీ ఏవి ఇవ్వ లేదు. ఇవన్నీ లేకుండా సినిమా రిలీజ్ చేస్తార అని నెటిజన్లు ముందు నుంచే అనుమానం వ్యక్తం చేశారు. యు.వి.క్రియేషన్స్ చేసిన ట్వీట్ ద్వారా వారి అనుమానం నిజమని నిరూపించారు. ఈ సంక్రాంతి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఒక చేదు అనుభవాన్ని చెప్పుకోవాలి.

- Advertisement -

Share post:

Popular