ప్రకాష్ రాజ్ తొలి భార్య శ్రీహరికి ఏమవుతుందో తెలుసా?

ప్రకాష్ రాజ్.. విలక్షణ నటుడు. సౌత్ తో పాటు నార్త్ లోనూ పలు సినిమాలు చేసిన నటుడు. నటుడిగా ఆయనను దేశం అంతా ఇష్టపడుతుంది. అయితే అదే స్థాయిలో ఆయను విమర్శించే వాళ్లు ఉన్నారు. గొప్ప నటుడు అయినప్పటికీ ప్రకాష్ రాజ్ ప్రవర్తన గురించి తోటి నటులు రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. దర్శకులు, నిర్మాతల చేత చాలా సార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. తెలుగు నిర్మాత సంఘం కూడా ఆయనపై ఒకప్పుడు బ్యాన్ విధించింది. డబ్బు తీసుకుని షూటింగ్ కు రాడని చాలా మంది నిర్మాతలు అప్పట్లో ఆయపై తీవ్ర ఆరోపణలు చేశారు.

సినిమా కెరీర్ మాత్రమే కాదు.. ఆయన వ్యక్తిగత జీవితం కూడా పలు వివాదాలకు కేరాఫ్ గా చెప్పుకోవచ్చు. ఆయన తొలి భార్యతో విడిపోయిన ప్రకాష్ రాజ్.. రెండో వివాహం చేసుకున్నాడు. 1894లో ప్రకాష్ రాజ్ తమిళ నటి లలిత కుమారిని పెళ్లి చేసుకున్నాడు. ఈ లలిత కుమారి శ్రీహరికి స్వయాన మరదలు. శ్రీహరి భార్య డిస్కో శాంతికి సొంత చెల్లి. ప్రకాష్ రాజ్, లలితకు ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి జన్మించారు. 2004లో కొడుకు అనుకోని ప్రమాదంలో కన్నుమూశాడు.

సుమారు 13 ఏండ్ల తర్వాత ప్రకాష్ రాజ్, లలితకు మధ్య వివాదాలు వచ్చాయి. దీంతో వారిద్దరు విడిపోయారు. శ్రీహరి కలుగజేసుకుని సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా కుదరలేదు. 2009లో వీరిద్దరు విడిపోయారు. బిడ్డల సంరక్షణ బాధ్యతలను ప్రకాష్ రాజ్ తీసుకున్నాడు. ఆ తర్వాత 2010లో పోనీ వర్మను ప్రకాష్ రాజ్ రెండో వివాహం చేసుకున్నాడు. ఈమె సినిమా పరిశ్రమలో కొరియోగ్రాఫర్. తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ పలు సినిమాలకు కొరియోగ్రఫీ చేసింది. వీరిద్దరికి 2015లో ఓ అబ్బాయి పుట్టాడు. ప్రస్తుతం వీరిద్దరు హ్యాపీగా ఉంటున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ మా అధ్యక్షుడిగా బరిలోకి దిగాడు. కానీ మంచు విష్ణు చేతిలో ఓడిపోయాడు. అనంతరం తెలుగు సినిమా పరిశ్రమలో అంతగా యాక్టింగ్ గా కనిపించడం లేదు.