పవన్ కళ్యాణ్ కి పెరుగుతున్న కమిట్మెంట్స్ భారం?

అజ్ఞాతవాసి సినిమా తరువాత రాజకీయాల వైపు నడిచినా పవన్ కళ్యాణ్ రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక ఆ తర్వాత బాలీవుడ్ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రీ ఎంట్రీ తర్వాత మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్. రీ ఎంట్రీ సినిమా వకీల్ సార్ పవన్ కళ్యాణ్ కు ఒక సాలిడ్ హిట్ అంధించింది. అయితే వకీల్ సాబ్ సినిమా విడుదలకు ముందే దర్శకుడు క్రిష్ తో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్తో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలకు కూడా సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్లో 29వ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నట్లు కూడా ప్రకటన చేశాడు. ఇక ఈ మూడు సినిమాలకు సంబంధించిన ప్రకటన చేసిన తర్వాత అయ్యప్పనుమ్ కోషియాన్ తెలుగు రీమేక్ భీమ్లా నాయక్ లో కూడా నటించబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. అయితే ముందు ప్రకటన చేసిన సినిమాలు అలాగే ఉన్నాయి. కానీ తర్వాత ప్రకటన చేసిన భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక సంక్రాంతికి విడుదల కావాల్సిన భీమ్లా నాయక్ సినిమా అనుకోని ఈ విధంగా ఫిబ్రవరి నెలలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే ప్రస్తుతం ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఇంకా చాలా సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది.

 

ఒకవైపు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భవదీయుడు భగత్ సింగ్ మరోవైపు సురేందర్ రెడ్డి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమా షూటింగ్ కూడా చేయాల్సి ఉంది. ఈ సినిమాలో షూటింగ్ నేపథ్యంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే 2024 ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే రెండేళ్ల ముందుగానే ఇక 2024 ఎన్నికలపై దృష్టి సారించి వ్యూహాత్మకంగా సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటినుంచి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితేనే 2024 ఎన్నికల్లో జనసేన సత్తా చాటే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు షూటింగ్ లు మాత్రం పవన్ కళ్యాణ్ ను ఒత్తిడి లోకి నెడుతున్నాయి అన్నది తెలుస్తుంది. మరి సమస్యను పవన్ ఎలా అధిగమిస్తారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

Share post:

Latest