భార్యకు కరోనా పాజిటివ్.. పండగ చేసుకున్న హీరో.. ఎవరో తెలుసా?

ఇటీవల టాలీవుడ్ సెలెబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతూ తమ అభిమానులతో పాటు కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్ హీరోలకు కరోనా సోకగా, ఇప్పుడు మూడో వేవ్‌లో కుర్ర హీరోలకు హీరోయిన్లలకు కరోనా సోకుతోంది. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మీనా, మంచు లక్ష్మీ వంటి వారు కరోనా బారిన పడగా, తాజాగా ఓ యంగ్ హీరో భార్యకు కరోనా సోకింది. అయితే తన భార్యకు కరోనా సోకడంతో ఆ హీరో పండగ చేసుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి మరీ ఎంజాయ్ చేశాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు.. అతడి భార్య ఎవరు.. ఆమెకు కరోనా సోకితే అతగాడు అలా ఎందుకు చేశాడు అనేగా మీ సందేహం..!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కరోనా కాలంలోనే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. షాలిని కందుకూరి అనే అమ్మాయిని నితిన్ పెళ్లాడాడు. అయితే తాజాగా ఆమెకు కరోనా పాజిటివ్ తేలడంతో ఆమె హోం ఐసోలేషన్‌లో ఉంటుంది. కాగా నేడు ఆమె పుట్టినరోజు కావడంతో భర్త, కుటుంబ సభ్యులతో కలిసి తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకునే వీలు లేకుండా పోయింది. అయితే తన భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు తన భార్య బదలుగా తానే కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేశాడు. అయితే ఇదంతా పైఫ్లోర్‌లో ఉన్న షాలినీ ఓ కిటికీలో నుంచి చూస్తూ ఉంది. కేక్ కట్ చేసిన నితిన్ ఆమెవైపు చూపిస్తూ నోరు తెరవమంటూ ఆమెకు చూపించిన కేక్ ముక్కను తానే తిన్నాడు.

దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అయితే నితిన్ చేసిన పనికి కొంతమంది నవ్వుకుంటే, చాలా మంది మాత్రం శభాష్ అంటున్నారు. భార్యకు ఆరోగ్యం బాలేకపోయినా తన బర్త్‌డేను సెలెబ్రేట్ చేసి భర్తగా తన భార్యపట్ల ప్రేమను ఈ విధంగా వ్యక్తపరిచిన నితిన్ నిజంగా గ్రేట్ అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఏదేమైనా భార్యకు కరోనా సోకితే కేక్ కట్ చేసి ఎంజాయ్ చేసుకున్న హీరోగా నితిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.

Share post:

Latest