మోహన్ బాబు, నాగార్జున.. చిరంజీవికి ఎవరంటే ఇష్టం?

చిరంజీవి, మోహన్ బాబు.. తెలుగు సినిమా పరిశ్రమలో ఇద్దరూ అద్భుత నటులు. టాలీవుడ్ లో ప్రస్తుతం వీరిద్దరు సీనియర్ హీరోలుగా ముందుకు సాగుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా వీరి అనుబంధం కొనసాగుతుంది. ఇంచుమించు ఇద్దరూ ఒకే సమయంలో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. చిరంజీవి కెరీర్ ఆరంభంలో ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే విలన్ క్యారెక్టర్స్ చేశారు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొత్తంగా ఆయన 150కి పైగా సినిమాలు చేశాడు. ప్రస్తుతం ఆచార్య సహా పలు వరుస సినిమాల్లో చిరంజీవి నటిస్తున్నాడు.

అటు మోహన్ బాబు సైతం నాలుగు దశాబ్దాలుగా సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నాడు. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు చేసిన ఆయన.. ఆ తర్వాత హీరోగా మారి కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే వీరిద్దరు ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేసుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత ఎంతో ఆప్యాయంగా కనిపిస్తూనే ఉంటారు. మోహన్ బాబు ముందు మాటలు సంధిస్తాడు. ఆ తర్వాత చిరంజీవి తన బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. తాజాగా జరిగిన మా ఎన్నికలకు ముందు వరకు వీరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. మా ఎన్నికల తర్వాత వీరి మధ్య మళ్లీ గ్యాప్ వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి.

అటు కొంత కాలం క్రితం మంచు లక్ష్మి ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో హోస్టుగా చేస్తూ మంచి ఆదరణ దక్కించుకుంది. ఇందులో భాగంగా ర్యాపిడ్ రౌండ్ లో కొన్ని ప్రశ్నలను అడిగింది. నాగార్జున, మోహన్ బాబు ఎవరంటే ఇష్టం అంటూ చిరంజీవిని అడిగింది. చిరంజీవి వెంటనే మోహన్ బాబు అని చెప్పాడు. మోహన్ బాబు ఎందుకు ఇష్టమో కూడా చెప్పాడు చిరంజీవి. మోహన్ బాబు పేరు చెప్పకుంటే చాలా గొడవలు అవుతాయన్నాడు. అందుకే ఆ పేరు చెప్పానంటూ నవ్వాడు.

Share post:

Latest