రాంగోపాల్ వర్మ ట్వీట్లకు మెగా బ్రదర్ నాగబాబు మద్దతు …మెగా ఫ్యాన్స్ ఫైర్ !

కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి అందరికి తెలిసిందే .రాంగోపాల్ వర్మ తరచుగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఎప్పుడు కెలికితాడు,అది ఎంతలాగంటే ఆర్జీవీ ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేసేంతగా అయినా వర్మ మెగా హీరోలను ఉద్దేశించి ట్వీట్స్ చేయడంలో ముందే ఉంటారు. పవన్ కళ్యాణ్ మీద ‘పవర్ స్టార్’ పేరుతో ఏకంగా ఒక సినిమా తీసేసాడు ఆర్జీవీ.. అది ఆడిందా లేదా వేరేసంగతి .

- Advertisement -

ఈ కాంట్రవర్సీ డైరెక్టర్ తో ఎప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఒకానొక టైం లో ఆర్జీవీ వ్యాఖలపై ఘాటుగా స్పందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఓ సినిమా ఫంక్షన్ లో నాగబాబు వర్మ ను టార్గెట్ చేస్తూ.. అక్కుపక్షి – కుసంస్కారి – సన్నాసి – వేస్ట్ ఫెలో వంటి పదాలుతో తిట్లు తిట్టారు . అసలు ఆర్జీవీ లాంటి వ్యక్తుల గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అనే విధంగా మెగా బ్రదర్ అప్పట్లో కామెంట్స్ చేసారు. అయితే వర్మ కు నాగబాబు సపోర్ట్ చేయడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలపై పెద్ద కాంట్రవర్సీ నడుస్తుందో అందరకి తెలిసిందే . ఈ వ్యవహారంపై లేట్గా స్పందించిన రాంగోపాల్ వర్మ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైసీపీ మినిస్టర్ పేర్ని నాని పై ట్విట్స్ మరియు వీడియో రూపంలో పెద్ద యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. టికెట్ ధరలు నియంత్రించడానికి ప్రభుత్వానికి ఏం అధికారం ఉందని అంటూ.. సినిమాను నిత్యావసర వస్తువుగా భావిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్లపై ఎందుకు రాయితీ ఇవ్వడం లేదని వర్మ ప్రశ్నించారు. హీరోలకు ఎంత పారితోషికం ఇవ్వాలనేది వ్యాపార లెక్కల్లో భాగమే తప్ప.. ఇంత ఇస్తే చాలు కదా అనడానికి వేరే వాళ్లకి ఎలా హక్కు ఉంటుందని అన్నారు.

ఇలా ఏపీ ప్రభుత్వానికి పది ప్రశ్నలను సంధిస్తూ ఆర్జీవీ ఓ వీడియోని పోస్ట్ చేసారు. అయితే ఆసక్తికరంగా రామ్ గోపాల్ వర్మ వీడియోకి మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ.. ‘‘మీరు చెప్పింది కచ్చితంగా నిజం. నేను ఏదైతే అనుకుంటున్నానో మీరూ అదే అడిగారు’’ అని పేర్కొన్నారు నాగబాబు. దీనికి రియాక్ట్ అయిన వర్మ.. ”థాంక్యూ నాగబాబు గారు.. మన సినీ పరిశ్రమ నుంచి ఈ సమస్యపై మరింత మంది స్పందిస్తారని భావిస్తున్నా” అని ట్వీట్ చేసారు.

ఆర్జీవీ – నాగబాబు..ఒకప్పుడు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకున్న ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ సమస్య మీద ఏకాభిప్రాయానికి రావడం మంచి విషయమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మెగా అభిమానులు నాగబాబు పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.వర్మ ఎలాంటోడో మర్చిపోయావా అని మెగా ఫ్యాన్స్ గుస అవుతున్నారు .

Share post:

Popular