బాలయ్య, బోయపాటి కాంబోలో ఈ లాజిక్ గుర్తించారా?

తెలుగు సినిమా పరిశ్రమలో బాలయ్య అంటేనే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆయన నటించిన ఎన్నో సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి కూడా. అయితే బాలయ్య కేవలం మాస్ సినిమాలే కాదు… అన్ని రకాల జోనర్లలో సినిమాలు చేశాడు. పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాల్లోనూ నటించి తనకు తానే చాటి నిరూపించుకున్నాడు. అయితే బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ ఎక్కువగా ఫ్యాక్షన్, రక్తపాతానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. వీరి కాంబోలో విడుదలైన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు వరుస విజయాలను అందుకున్నాయి.

వరుసగా రెండు సినిమాలు విడుదలై సక్సెస్ కొట్టడంతో తాజాగా విడుదలైన అఖండపై జనాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుకున్నట్లుగానే అఖండ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఓటీటీలో విడుదలై మంచి జనాదరణ దక్కించుకుంది. అక్కడ కూడా రేటింగ్ బాగానే సాధించింది. సిల్వర్ స్ర్కీన్ అయినా.. ఓటీటీ అయినా బాలయ్య బాలయ్యే అని మరోమారు తేలిపోయింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాల్లో ఓ కామన్ పాయింట్ ఉంది. మూడు సినిమాల్లోనూ బాలయ్య డబుల్ రోల్స్ చేశాడు. అంతేకాదు.. మూడు సినిమాల్లోనూ చిన్న బాలయ్య కనిపించిన సమయంలో పెద్ద బాలయ్య కనిపించడు.. పెద్ద బాలయ్య కనిపించే సమయంలో చిన్న బాలయ్య కనిపించడు. ఇదో విశేషంగా చెప్పుకోవచ్చు. అటు ఈ మూడు సినిమాలకు సంబంధించి లోగోలు ఒకే రంగులో ఉంటాయి. ఒకే లుక్ లో కనిపిస్తాయి కూడా. అయితే బాలయ్య అభిమానులకు ఈ లాజిక్ అవసరం లేదు. తమ అభిమాన హీరో అంటే.. సినిమా చూడాలి ఎంజాయ్ చేయాలి అంతే. మొత్తంగా బాలయ్య, బోయపాటి కాంబో అంటే మంచి క్రేజ్ ఏర్పడింది. వీరిద్దరు కలిసి తెరకెక్కించిన సినిమా అంటే హిట్ ఖాయం అనే స్థాయికి చేరారు. బాలయ్య అభిమానులు మాత్రం వీరి కాంబినేషన్ పై పిచ్చ క్రేజ్ ఏర్పర్చుకున్నారు.

Share post:

Latest