వామ్మో.. కృతి శెట్టి.. హీరో కంటే ఎక్కువ రెమ్యూనరేషన్?

ఉప్పెన అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన కృతి శెట్టి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మడికి అదృష్టం కూడా బాగా కలిసి రావడంతో ఇక వరుసగా సినిమా అవకాశాలు వచ్చి ఈ ముద్దుగుమ్మ ముందు వాలిపోయాయ్. ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది కృతి శెట్టి. అంతేకాదు వరుస విజయాలను ఖాతాలో వేసుకుని దూసుకుపోతుంది. ఇటీవలే నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్యామ్ సింగ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది కృతి శెట్టి.

ఇక ఇప్పుడు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన బంగార్రాజు సినిమాల్లో కూడా నటించి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇక మరో హిట్ కృతి శెట్టి ఖాతాలో పడినట్లే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంకోవైపు రవితేజ సహా మరికొంతమంది స్టార్ హీరోలతో నటిస్తుంది కృతి శెట్టి. ఇక ఈ సొట్టబుగ్గల సుందరి అందానికి తెలుగు ప్రేక్షకులు అందరూ ఫిదా అవుతున్నారు అని అర్థమవుతుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కృతి శెట్టి రెమ్యునిరేషన్ విషయంలో కూడా తగ్గేదేలేదు అన్నట్లుగా పెంచేస్తుందట.

ఇకపోతే ప్రస్తుతం కృతి శెట్టి మహేష్ బాబు బావ సుధీర్ బాబు తో కలిసి ఒక సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విభిన్నమైన కథలు ఎంచుకుంటూ మంచి విషయాలను సాధిస్తూ దూసుకుపోతున్నాడు సుధీర్బాబు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం సుధీర్ బాబు కృతి శెట్టి కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో సుధీర్ బాబు కన్నా రెమ్యూనరేషన్ కృతి శెట్టి కి ఎక్కువగా ఇస్తున్నారట. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండగా ఏకంగా ఈ సొట్ట బుగ్గల సుందరి రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయగా ప్రొడ్యూసర్లు కూడా ఒప్పుకున్నారట. అయితే సుధీర్ బాబు మాత్రం కృతి శెట్టి కంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది అన్నది తెలుస్తుంది.

Share post:

Latest