వసూళ్ల సునామీ.. క్రాస్ రోడ్స్ లో రికార్డు కొట్టిన సినిమాలు ఇవే?

సాధారణంగా యువ హీరోల సినిమాలలో కథ బాగుంటే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తూ మంచి హిట్టు అందిస్తూ వుంటారు. అలాంటిది స్టార్ హీరోగా కొనసాగుతున్న వారు సాలిడ్ కథ తో ప్రేక్షకుల ముందుకు వస్తే ఇక బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడం ఖాయం. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి. అయితే ఇటీవలి కాలంలో సీనియర్ స్టార్ హీరోలతో పోల్చిచూస్తే జూనియర్ స్టార్ హీరోల సినిమాలు భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. ఇక సీనియర్ హీరోల సినిమాలు హిట్ కొట్టిన వసూళ్లు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. కానీ ఇటీవలే తన సినిమాతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు నందమూరి బాలకృష్ణ. అఖండ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వసూళ్ల సునామీ సృష్టించాడు.

 

ఇక అఖండ సినిమా ఎంత ఘన విజయం సాధించింది అంటే నందమూరి బాలకృష్ణ కెరియర్ లోనే హైయెస్ట్ వసూళ్లను రాబట్టి సినిమా. అంతేకాదు ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో కనుమరుగైపోయిన 50 రోజుల పోస్టర్స్ అఖండ సినిమాతో మరోసారి తెరమీదకు తెచ్చాడు బాలకృష్ణ. అంతేకాదు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో అద్భుతమైన వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. కేవలం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే అఖండ సినిమా కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్స్ చేయడం గమనార్హం. అయితే టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్స్ చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం.

చిరంజీవి 5, బాలకృష్ణ 2, మహేష్ బాబు 9, ప్రభాస్ 5, పవన్ కళ్యాణ్ 4, అల్లు అర్జున్ 6, ఎన్టీఆర్ 2, రామ్ చరణ్ 2.. ఇలా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కోటి రూపాయల వసూళ్లు సాధించిన సినిమాలు గా ఉన్నాయ్. ఈ సినిమాలలో మహేష్ బాబు టాప్ లో ఉండడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండో ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొనసాగుతుండడం గమనార్హం.

Share post:

Popular