చిరంజీవి సినిమా బ్లాక్ లో ఐదు టికెట్స్ కోసం 10 వేలు పెట్టి కొన్న దర్శకుడు ఎవరో తెలుసా?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయినా దర్శకుడు బోయపాటి శ్రీను అని చెబుతూ ఉంటారు. అచ్చం ఇలాగే నిన్నటి తరంలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బి.గోపాల్. బి.గోపాల్ సినిమా వచ్చిందంటే చాలు మాస్ ప్రేక్షకులందరికీ పూనకాలు వచ్చేవి. అంతలా పవర్ఫుల్ సినిమాలను తెరకెక్కిస్తు ఉండేవారు బి.గోపాల్. బాలకృష్ణ చిరంజీవి లాంటి హీరోలతో ఎన్నో యాక్షన్ సినిమాలను తెరకెక్కించి తెలుగు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు బి గోపాల్. ఇక బి.గోపాల్ చిరంజీవి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషనల్ విజయాన్ని సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో ముందుగా వినిపించే పేరు ఇంద్ర.

చిరంజీవి హీరోగా వచ్చిన ఇంద్ర సినిమా ఎన్ని రికార్డులు కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డైలాగుల దగ్గరనుంచి డాన్సు ల వరకు.. పాటల దగ్గరనుంచి ప్రతి సన్నివేశం వరకు ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక చిత్ర పరిశ్రమలో ఈ సినిమా కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది అని చెప్పాలి. అంతే కాదుఇప్పటికే స్టార్ డైరెక్టర్ గా ఉన్న బి.గోపాల్ కు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. నిర్మాతలకు లాభాల పంట పండేలా చేసింది. అయితే ఒకానొక సమయంలో ఇంద్ర సినిమా గురించి కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు దర్శకుడు బి.గోపాల్.

 

మెగాస్టార్ తో తీసిన ఇంద్ర సినిమాలో పాటలు డైలాగ్స్ యాక్షన్ సన్నివేశాలు అన్నీ బాగా కుదిరాయి ప్రేక్షకులందరినీ మెప్పించాయి. అందుకే సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇంద్ర సినిమా గురించి మాట్లాడాలి అంటే ఒక విషయం గురించి మాత్రం తప్పక చెప్పాల్సిందే. సాధారణంగా సినిమా విడుదలైనప్పుడు 500, 1000 రూపాయలు పెట్టి బ్లాక్ టికెట్లు కొనుగోలు చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఒక వ్యక్తి మాత్రం ఇంద్ర సినిమా ఫస్ట్ షో సమయం లో ఒక్క డైరెక్టర్ ఏకంగా పదివేల రూపాయలు పెట్టి ఐదు టిక్కెట్లు కొనుగోలు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. ఇక ఈ విషయం తెలిసి నేను షాకయ్యను. ఆ రేంజ్ లో మెగాస్టార్ క్రేజ్ ఉండేది అంటూ బి.గోపాల్ చెప్పుకొచ్చారు. అయితే తన దర్శకత్వంలో వచ్చిన స్టేట్ రౌడీ సినిమా కి మెగాస్టార్ ఎలా కష్టపడ్డారో.. ఇక ఇంద్ర సినిమా కి కూడా అంతే కష్టపడటం నేను కళ్ళారా చూసాను అంటూ బి.గోపాల్ చెప్పుకొచ్చారు.

Share post:

Popular