ఆ క్రికెటర్ పై పిచ్చితో జయలలిత అంత పని చేసిందా ..?

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తిరుగులేని స్టార్‌డ‌మ్ ఎంజాయ్ చేసిన జ‌య‌ల‌లిత సౌత్‌లో తెలుగు, త‌మిళ్‌లో ఎంతో మంది స్టార్ హీరోల‌తో ఎన్నో సినిమాల్లో న‌టించింది. ఆ త‌ర్వాత ఎమ్జీఆర్ వార‌సురాలిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన జ‌య‌ల‌లిత ఇక్క‌డ కూడా త‌మిళ రాజ‌కీయాల‌ను ఒంటి చేత్తో ఏలేసింది. అన్నాడీఎంకే అధినేత్రిగా ఉన్న ఆమె మ‌ర‌ణానికి ముందు వ‌రుస‌గా రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చారు. ఆమె ముఖ్య‌మంత్రిగా ఉండ‌గానే మృతిచెందారు.

జ‌య‌ల‌లిత సినిమా రంగంలో మాత్ర‌మే కాదు.. అటు రాజ‌కీయాల్లోనూ తిరుగులేని క్వీన్‌గా అవ‌త‌రించింది. సినిమాల్లో అయితే జ‌య‌ల‌లిత ఏ పాత్ర‌లో అయినా అలా లీన‌మై న‌టించేది. త‌న డ్యాన్సుల‌తో పాటు త‌న న‌ట‌న‌తో క‌ట్టిప‌డేసేది. రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక జ‌య‌ల‌లిత ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నారు. త‌ర్వాత ఆ అవ‌మానాలు దిగ‌మింగుకుని మ‌రీ ఆమె నిల‌దొక్కుకుని ముఖ్య‌మంత్రి అయ్యారు.

ఓ మ‌హిళ ఇన్ని అవ‌మానాలు ఎదుర్కొని ముఖ్య‌మంత్రి అవ్వ‌డం అంటే ఆమెకు మామూలు గ‌ట్స్ లేవ‌నే చెప్పాలి. ఇక ఆమె హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్న‌ప్పుడు ఆమెకు క్రికెట్ అంటే మ‌హా పిచ్చి అట‌. త‌న చిన్న‌ప్పుడు క్రికెట్‌కు సంబంధించి ఏ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ వ‌చ్చినా కూడా ఆ క‌టింగ్‌ను చాలా జాగ్ర‌త్త‌గా దాచుకునేవార‌ట‌. ఇక చిన్న‌ప్పుడు మ్యాచ్‌లు చూసేందుకు త‌న స్నేహితుల‌తో క‌లిసి గ్రౌండ్‌కు వెళ్లేవార‌ట జ‌య‌.

ఈ క్ర‌మంలోనే చెన్నైలో ఎప్పుడు మ్యాచ్‌లు జ‌రిగినా అక్క‌డ‌కు వెళ్లి వారి ఆటోగ్రాఫ్‌లు తీసుకునేద‌ట‌. అప్ప‌ట్లో టీం ఇండియాకు కెప్టెన్‌గా ఉన్న మ‌న్సూర్ ఆలీఖాన్ ప‌టౌడీ అంటే జ‌య‌ల‌లిత‌కు చాలా ఇష్ట‌మ‌ట‌. ఆమె స్టార్ హీరోయిన్‌గా ఉన్న‌ప్పుడు కూడా అతడిని ఎన్నోసార్లు కలిసిందట.. ఈ విషయాన్ని తనే స్వయంగా తన డైరీలో రాసుకుంది.

Share post:

Latest