బన్నీతో ఆ డైలాగ్ చెప్పించే సరికి చుక్కలు కనిపించాయి:చిత్తూరు కుర్రాడు

నాలుగు ఫైట్లు.. మూడు పాటలు.. రెండు పంచు డైలాగులు.. 3 కామెడీ సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి అంటే చాలు హిట్.. సూపర్ హిట్.. బంపర్ హిట్.. ఒక స్టార్ హీరో ముఖం సినిమాలో కనిపించింది అంటే చాలు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే. ఇదంతా ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులంతా పంథా మారిపోయింది. ఈ సినిమాలో కూడా కొత్తదనాన్ని వెతుక్కుంటున్నారు ప్రేక్షకులు.. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు కూడా సరికొత్తగా సినిమాలు తీయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా పుష్ప.

 

టాలీవుడ్ లెక్కల మాస్టారు గా పేరు తెచ్చుకున్న సుకుమార్.. అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ మూడు గంటల పాటు మరో లోకంలోకి తీసుకెళ్ళింది అని చెప్పాలి. ఎప్పుడు లవర్ బాయ్ గా కనిపించే అల్లు అర్జున్ ఈ సినిమాలో మాత్రం తనని తాను కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. చిత్తూరు యాసలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు ప్రేక్షకులందరికి ఫిదా చేశాయ్. అయితే అల్లు అర్జున్ అంత అద్భుతంగా చిత్తూరు యాసలో డైలాగులు చెప్పడానికి వెనుక నాయుడుపేట మండలం పూడూరు ప్రాంతానికి చెందిన చరణ్ అనే యువకుడు కష్టం ఎంతో ఉంది అని చెప్పాలి.

చరణ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హాజరై పుష్పా సినిమాలో నటీనటులకు చిత్తూరు యాస నేర్పించిన అనుభవాలను పంచుకున్నారు. అల్లు అర్జున్ సార్ కు చిత్తూరు యాస నేర్పించే అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదు అంటూ చెప్పుకొచ్చాడు చరణ్. నా ఫస్ట్ షూటింగ్.. ఫస్ట్ డైలాగ్ బన్నీ సార్ తోనే చేయాల్సి వచ్చింది అంటూ చరణ్ తెలిపాడు. ఆ సమయంలో ఎంతగానో టెన్షన్ పడ్డాను. ఆడే కూలోడు.. ఆడికి మనం కులోళ్ళవేంట్రా అంటూ బన్నీ సార్ కు డైలాగ్ చెబుతున్న సమయంలో చెమటలు పట్టేశాయి. అయితే ఈ డైలాగ్ చెప్పిన తర్వాత బన్నీ మెచ్చుకోవడంతో ఎంతగానో ఆనందపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు చరణ్.తన ఫేవరెట్ నటుడు సునీల్ కి కూడా చిత్తూరు యాస నేర్పించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది తెలిపాడు.

Share post:

Popular