బాలయ్య నెక్స్ట్ మూవీ డైలాగ్ వచ్చేసింది ..మళ్లీ ఫ్యాన్స్ కి పండగే !

టాలీవుడ్ లో ఉన్న హీరోలో పోలిస్తే బాలకృష్ణ కు ప్రత్యేక స్థానం .హిట్ ,ప్లాఫ్ తో సంబంధం లేకుకుండా సినిమాలు చేస్తూ ఫాన్స్ ఎంటర్టైన్ చేస్తుంటారు .నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మాస్ చిత్రం “అఖండ” రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్తో దూసుకుపోతుందో అందరికీ తెలిసిందే. దర్శకుడు బోయపాటి శ్రీనుతో తీసిన ఈ భారీ సినిమా ఇప్పటికీ కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుంది .

ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని తో బాలయ్య తన 107వ సినిమా చేస్తున్నారు. గోపీచంద్ మలినేని ,మాస్ మహారాజ్ రవితేజ బాలయ్య టాక్ షో అయినటువంటి “అన్ స్టాప్పబుల్” కి రాగా ఇందులో బాలయ్య గోపీచంద్ సినిమాలో ఉన్న ఓ పవర్ ఫుల్ డైలాగ్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

అదేమిటంటే “రేయ్ రోడ్డు మీదకి జింక వచ్చిందనుకో ఎవడైనా హారన్ కొడతాడు అదే సింహం వచ్చిందంటే ఇంజిన్ కూడా ఆపేసి సైలెంట్గా కూర్చుంటాడు అక్కడ ఉన్నది సింహం రా రేయ్” అని ఉంటుందట. ఇప్పుడు ఇదే డైలాగ్ సోషల్ మీడియాలో మరియు బాలయ్య అభిమానుల్లో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

Share post:

Latest