ఆ రోజు షూటింగ్ లో చనిపోయేదాన్ని.. నిజం బయట పెట్టిన గులాబీ హీరోయిన్

?

 

గులాబీ హీరోయిన్ మహేశ్వరి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అమ్మాయి కాపురం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది మహేశ్వరి. మొదటి సినిమా ఈమెకు అనుకున్నంత గుర్తింపు మాత్రం తెచ్చి పెట్టలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన గులాబీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలిగా మారిపోయింది మహేశ్వరి. ఇక ఆ తర్వాత వడ్డేనవీన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెళ్లి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది.

ఇక ఆ తర్వాత ఈ హీరోయిన్ నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆదరణ పొందలేదు. దీంతో అవకాశాలు తక్కువ అవడంతో తెలుగు తెరపై కనుమరుగైపోయింది మహేశ్వరి. ఇకపోతే మహేశ్వరి అభిమానులందరూ ఈ అమ్మడు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తే బాగుండు అని కోరుకుంటున్నారు అని చెప్పాలి. ఇటీవల ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది మహేశ్వరి. ఈ సందర్భంగా తన కెరీర్ కు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంది. గులాబీ సినిమా చేస్తున్నప్పుడు నాకు మంచి పేరు వస్తుందని అనుకున్నాను.. కానీ సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది అని అనుకోలేదు మహేశ్వరి తెలిపింది.

 

ఇక గులాబీ సినిమా షూటింగ్ సమయంలో నా ప్రాణాలు పోయాయి అంటూ తనకు ఎదురైన చేదు అనుభవం చెప్పుకొచ్చింది. మేఘాలలో తేలిపోతున్నది అనే పాట సమయంలో ఎదురుగా మారుతీ వ్యాన్ లో కెమెరా పట్టుకుని ముందుకు వస్తారు ఆ సమయంలో బైక్ స్కిడ్ అయ్యి పక్కనే ఉన్న లోయలోకి జారిపోయింది. అక్కడ ఒక చెట్టుకు బైక్ చిక్కుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డామ్. లేదంటే ఆ రోజే చనిపోయే దాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆరోజు సాంగ్ షూటింగ్ సమయంలో జరిగిన ఘటనను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చెప్పుకొచ్చింది మహేశ్వరి. ఇక ఇండస్ట్రీలో తనకు మీనా, సంగీత మంచి స్నేహితులు అంటూ తెలిపింది.

Share post:

Latest