సూసైడ్ చేసుకోవాల‌నుకున్న ఇలియానా.. అస‌లేమైందో తెలుసా?

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రామ్ హీరోగా వై.వి.ఎస్.చౌదరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `దేవ‌దాసు` సినిమా తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ వెంట‌నే మ‌హేష్‌కు జోడీగా `పోకిరి` చిత్రంలో న‌టించి మ‌ళ్లీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను అందుకున్న ఇలియానా.. అన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోయింది.

అయితే టాలీవుడ్‌లో వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న స‌మ‌యంతో ఇలియానా మ‌న‌సు బాలీవుడ్ వైపు మ‌ల్లింది. అక్క‌డ కూడా స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకోవాల‌ని ఆరాట‌ప‌డింది. కానీ, ఇలియానా ఆశ‌లు ఆశ‌లుగానే మిగిలిపోయాయి. బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేసినా ఆమె స‌క్సెస్ కాలేక‌పోయింది. ఇక ఆ త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్‌లోకి ఇలియానా వ‌చ్చినా.. ద‌ర్శ‌కనిర్మాత‌లు ఆమెను ప‌క్క‌న పెట్టేశారు.

ఇక ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ఇలియానా ఓ సారి సూసైడ్ చేసుకుని చ‌నిపోవాల‌నుకుంద‌ట‌. అందుకు కార‌ణం ఆమెకు ఉన్న వ్యాధే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇలియానా బాడీ డిస్మోర్ఫిక్ డిజార్డర్ కి గురైందట. బాడీ డిస్మోర్ఫిక్ డిజార్డర్ అనేది ఒక మానసిక రుగ్మత. ఈ వ్యాధి ఉన్న వారికి ఆత్మహత్య ఆలోచనలు మరియు ఆత్మహత్య ప్రయత్నాలు ఎక్కువ‌గా చేస్తారు.

ఈ నేప‌థ్యంలోనే ఇలియానా కూడా ఆ వ్యాధి కార‌ణంగా తీవ్ర ఒత్తిడికి లోనై ఓ ద‌శ‌లో సూసైడ్ చేసుకుందాం అనుకుందట. కానీ, తనకు తాను ధైర్యం చెప్పుకుని ఈ సమస్య నుంచి ఎలాగోలా ఇలియానా బయటపడింద‌ట‌. ఈ విష‌యాన్ని గ‌తంలో ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది.

 

Share post:

Popular