వలిమై..ట్రైలర్ తో అదరకొడుతున్న అజిత్..!

అజిత్ కుమార్ హీరోగా.. హెచ్ వినొత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వలిమై. ఈ సినిమాని జి స్టూడియోస్ మరియు బోనికపూర్ లు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్లు, వీడియోలు.. ప్రేక్షకులను బాగానే అలరించాయి అని చెప్పవచ్చు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారింది.

- Advertisement -

ఈ సినిమా ట్రైలర్ ఎంతో ఆసక్తిగా కొనసాగుతోంది. అజిత్ మరియు కార్తికేయ మధ్య.. కొన్ని పర్ఫామెన్స్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా ఈ సినిమాకే హైలెట్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి. ఇందులో హుయ ఖురేషి, బాణి, సుమిత్ర, అచ్యుత్ కుమార్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. మరి అయితే ఈ సినిమా ఎంతటి రికార్డులను కొల్లగొడుతున్నారు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.మీరు ఈ ట్రైలర్ ను ఒకసారి చూసేయండి.

Share post:

Popular