కుటుంబంతో పుష్ప సినిమాను చూసిన బాలకృష్ణ.. ఏమన్నారంటే..!

నందమూరి బాలకృష్ణ తన ప్యామిలితో కలిసి పుష్ప సినిమాని చూడడం జరిగింది. అందుకోసం మైత్రి మూవీ మేకర్స్ వారు బాలయ్య కోసం ఒక స్పెషల్ స్క్రీన్ ని వేయించారు. ఇక బాలకృష్ణ తో పాటు ఆయన సోదరి పురందేశ్వరి, బాలకృష్ణ భార్య వసుంధర, కొడుకు కూతురు ఆమె భర్త అందరూ కలిసి ఈ సినిమాను నిన్నటి రోజున సాయంత్రం వేళ చూశారు. అలా సినిమా చూసి థియేటర్ బయట నుండి వస్తున్న ఒక వీడియో వైరల్ గా మారుతోంది.

బాలయ్య తగ్గేదేలే ? : Balakrishna MASS Reaction After Watching Pushpa Movie | Pushpa | WP - YouTube

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా పుష్ప మేనియా కొనసాగుతూనే ఉంది. ఇక అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో పుష్ప రాజ్ పాత్రలో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని చెప్పవచ్చు. ఇది సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదలై 200 కోట్ల క్లబ్ లో చేరినట్లుగా సమాచారం.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ చెప్పిన తగ్గేదెలా డైలాగ్ ఎక్కువగా ఫేమస్ అయ్యింది.. ఇక బాలకృష్ణ ఆహలో unstoppable షోకి హోస్టుగా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక అలా అల్లు అర్జున్ ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ బాగా స్నేహంగా ఉంది. ఇక థియేటర్ బయటకు వచ్చి బాలయ్య కూడా తగ్గేది లేదని డైలాగ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది