`శ్యామ్ సింగ‌రాయ్‌` డే 2 క‌లెక్ష‌న్స్‌..నాని ఇంకా ఎంత రాబ‌ట్టాలంటే..?

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. డిసెంబ‌ర్ 24న‌ తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌లై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

1970లలో కలకత్తాలో ఉన్న దేవదాసీ వ్యవస్థను ప్రధానంగా చేసుకుని తెర‌కెక్కించిన ఈ చిత్రంలో నాని రెండు డిఫ‌రెంట్ పాత్ర‌ల‌ను పోషించి అద‌ర‌గొట్టాడు. రాహుల్ డైరెక్షన్, నాని- సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్, క్లైమాక్స్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వంటి అంశాలు బాగా ఆక‌ట్టుకోవ‌డంతో..సినిమాకు మంచి కలెక్షన్స్ వ‌స్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7 కోట్లు షేర్ వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు మ‌రింత పుంజుకుంది. ఇంకా చెప్పాలంటే మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూలు చేసింది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో 4.17 కోట్లు రూపాయల షేర్ రాబ‌ట్టిన ఈ చిత్రం.. రెండో రోజు 4.38 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఇక‌ ఏరియాల వారిగా శ్యామ్ సింగరాయ్ రెండో రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం- 2.21 కోట్లు
సీడెడ్ం- 65 లక్షలు
ఉత్తరాంధ్ర- 52 లక్షలు
ఈస్ట్- 21 లక్షలు
వెస్ట్- 17 లక్షలు
గుంటూరు- 27 లక్షలు
కృష్ణా- 20 లక్షలు
నెల్లూరు- 15 లక్షలు
—————————————————————————–
ఏపీ+తెలంగా ఫస్ట్ డే కలెక్షన్స్- 4.38 కోట్లు (7.12 కోట్లు గ్రాస్)
—————————————————————————–

రెండు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా శ్యామ్ సింగరాయ్ వసూళ్లు:

నైజాం- 4.33 కోట్లు
సీడెడ్ం- 1.27 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.03 కోట్లు
ఈస్ట్- 0.41 కోట్లు
వెస్ట్- 0.33 కోట్లు
గుంటూరు- 0.53 కోట్లు
కృష్ణా- 0.38 కోట్లు
నెల్లూరు- 0.27 కోట్లు
—————————————————————————–
ఏపీ+తెలంగా ఫస్ట్ డే కలెక్షన్స్- 8.56 కోట్లు (14.02 కోట్లు గ్రాస్)
—————————————————————————–
కర్ణాకట+రెస్ట్ ఆఫ్ ఇండియా- 1.95 కోట్లు
ఓవర్సీస్- 2.30 కోట్లు
టోటల్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్- 12.81 కోట్లు (22.50 కోట్లు గ్రాస్)

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.22 కోట్ల బిజినెస్ చేసిన శ్యామ్ సింగ‌రాయ్‌..బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.22.5 కోట్లను రాబ‌ట్టాల్సి ఉంటుంది.అయితే మొద‌టి రెండు రోజుల్లో రూ.12.81 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. ఇంకా రూ. 9.69 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంటే సేఫ్ అయిన‌ట్టే.

Share post:

Latest