స‌న్నీ ప్రైజ్‌మ‌నీ కంటే ఎక్కువ సంపాదించిన ష‌న్ను..ఎంతో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆదివారంతో విజ‌య వంతంగా ముగిసిన సంగ‌తి తెలిసిందే. హౌస్‌లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుంచే తన ఎనర్జీతో, మాటలతో అందరినీ ఆక‌ట్టుకుంటూ వ‌చ్చిన వీజే.స‌న్నీనే సీజ‌న్ 5 విజేత‌గా నిలిచి.. ట్రోఫీని, రూ.50 ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీని ఎగ‌రేసుకుని వెళ్లిపోయాడు.

సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్‌ నుంచి షాద్‌నగర్‌లో రూ.25 లక్షల విలువ చేసే ప్లాట్ మ‌రియు టీవీఎస్ బైక్‌ను కూడా స‌న్నీ గెలుచుకున్నాడు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉంది కానీ, ర‌న్న‌ర్‌గా నిలిచిన యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్‌ జశ్వంత్ రెమ్యూన‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ షోలో అత‌డి సంపాద‌న స‌న్నీ గెలుచుకున్న‌ ప్రైజ్‌మ‌న్నీ కంటే ఎక్కువ‌గా ఉండ‌ట‌మే అందుకు కార‌ణం. షో మొద‌ట‌ల్లో ఎవ‌రితోనూ క‌ల‌వ‌లేక‌పోయిన ష‌న్ను.. ఏదో ఒక మూలన ఉండేవాడు. టాస్కుల్లో ఆడటానికి కూడా పెద్ద ఇంట్ర‌స్ట్ చూపేవాడు కాదు. అయితే వారాలు గ‌డిచే కొద్దీ త‌న భ‌యాల‌ను, బిడియాన్ని ప‌క్క‌న పెట్టి ప‌క్కా ప్లానింగ్‌తో గేమ్ ఆడ‌టం స్టార్ట్ చేశాడు.

ఇక ఎలాగోలా గెలుపు అంచుల దాకా వెళ్లిన ష‌న్నూ.. టైటిల్‌ మిస్ చేసుకున్న‌ప్ప‌టికీ పారితోషికం​ మాత్రం గట్టిగానే పుచ్చుకున్నాడ‌ట‌. ఒక్క వారానికి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు అత‌డికి ముట్టజెప్పారట. ఈ లెక్క‌న్న ప‌దిహేను వారాల‌కు గానూ ష‌ణ్ముఖ్ రూ. 65 వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ తీసుకున్నాడ‌ని జోరుగా నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

 

Share post:

Latest