దీప్తితో బ్రేక‌ప్‌..న‌న్ను బ్లాక్ చేసిందంటూ షణ్ముఖ్ ఆవేద‌న‌!?

యూట్యూబ్ స్టార్స్‌, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, దీప్తి సున‌య‌న‌లు ఎప్ప‌టి నుంచో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. త‌మ ప్రేమ‌కు గుర్తుగా వీరిద్ద‌రూ టాటూలు కూడావేయించుకున్నారు. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతారని అభిమానులు సంబ‌ర‌ప‌డుతున్న సమయంలో బిగ్ బాస్ వీరి మ‌ధ్య పెద్ద‌ చిచ్చు పెట్టాడు.

బిగ్‌బాస్ సీజ‌న్ 5లో పాల్గొన్న ష‌ణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరితో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించాడు. స్నేహం పేరుతో సిరి కిస్సులు, హ‌గ్గులు ఇచ్చి నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. ఫలితంగా కప్పు చేజార్చుకొని రన్నరప్‌గా నిలిచాడు. మ‌రోవైపు సిరితో ష‌ణ్ముఖ్ ప్ర‌వ‌ర్తించిన తీరుకు దీప్తి బాగా ఫీలైంద‌ని, ఈ క్ర‌మంలోనే ష‌న్నూకి బ్రేక‌ప్ చేప్పింద‌ని గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే తాజాగా తన ఇన్ స్టా లైవ్ లోకి వచ్చిన షణ్ముఖ్.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ క్ర‌మంలోనే చాలా మంది దీప్తితో బ్రేక‌ప్ మ్యాట‌ర్ గురించే అడ‌గ‌డంతో.. ష‌ణ్ముఖ్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ష‌ణ్ముఖ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తనని బ్లాక్‌ చేసింది, చాలా బాధ‌గా ఉంది. అయితే త్వరలోనే హైదరాబాద్‌ వెళ్లి తనని కలుస్తానని చెప్పుకొచ్చాడు.

దీపు నా వల్ల చాలా నెగిటివిటిని ఫేస్‌ చేసింది. అయనప్పటికీ నాకోసం నిలబడింది. తప్పకుండా వెళ్లి మాట్లాడతాను. ఇక తనతో బ్రేకప్‌ అయితే జరగదు. నా చేతి మీద ఉన్న పచ్చబొట్టు పోయేంత వరకు దీపును వదలను అంటూ ఈ సంద‌ర్భంగా ష‌ణ్ముఖ్ పేర్కొన్నారు. మ‌రి ఇప్ప‌టికే వీరిద్ద‌రిపై వ‌స్తున్న బ్రేక‌ప్ వార్త‌ల‌కు పులిస్టాప్ ప‌డుతుందో లేదో చూడాలి.

https://www.instagram.com/tv/CX8h-80B5dw/?utm_source=ig_web_copy_link

Share post:

Latest