R R R ఏపీ బిజినెస్ లెక్క‌లివే… తేడా వ‌స్తే ఎన్ని కోట్లు పోతాయో తెలుసా..!

ఎన్టీఆర్ – రామ్ చరణ్ – రాజమౌళి ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలిసినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి దిగుతుందా ? అని దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సినీ ప్రముఖులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ వస్తున్నారు. మ‌ధ్య‌లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ – రాజమౌళి ముగ్గురు కూడా కరోనా భారిన పడ్డారు. కరోనా ఇప్పటికే రెండు దశల్లో రావడంతో త్రిబుల్ ఆర్ షూటింగ్ ఏడాదికిపైగా నిలిచిపోయింది. దీనికితోడు రాజీపడని రాజమౌళి ప‌ర్‌ఫెక్ష‌న్‌ కూడా త్రిబుల్ ఆర్ సినిమా మరింత ఆలస్యం కావడానికి కారణమైంది.

ఇక ఏపీలో ప‌రిస్థితులు ఇప్పుడు సినిమాల రిలీజ్‌కు ఏ మాత్రం బాగాలేవు. మ‌రోవైపు ఒమిక్రాన్ వైర‌స్ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో నైట్ క‌ర్ప్యూ అమ‌ల్లోకి వ‌స్తోంది. మ‌రోవైపు కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేట‌ర్లు న‌డ‌పాల‌న్న నిబంధ‌న‌లు కూడా అమ‌ల్లోకి వ‌స్తున్నాయి. ఇక వీట‌న్నింటికి మించి ఏపీలో టిక్కెట్ల రేట్ల దెబ్బ‌తో పాటు ప్ర‌భుత్వ యంత్రాంగం దాడుల‌తో దాదాపు 300కు పైగా థియేట‌ర్లు మూసివేశారు. రోజుకు ప‌దుల సంఖ్య‌లో థియేట‌ర్లు మూత‌ప‌డుతున్నాయి.

ఇక ఏపీ వ‌ర‌కు చూస్తే త్రిఫుల్ ఆర్‌ను రు. 140 కోట్ల రేషియోలో అమ్మారు. ఏపీ, సీడెడ్ క‌లిపి.. ఇప్పుడు ఉన్న రేట్ల‌కు అమ్మితే నెల రోజుల పాటు అన్ని షోలు హౌస్ ఫుల్ అయినా… సినిమా ఆ రేంజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా కూడా ఆ వ‌సూళ్లు రావ‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి. బెనిఫిట్ షోల‌తో పాటు రోజుకు 5 షోలు ఓ వారం, ప‌ది రోజులు వేసి.. సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ వ‌స్తే త‌ప్పా ఈ రేంజ్ వ‌సూళ్లు రావు.

అప్పుడు కూడా రు. 140 కోట్ల టార్గెట్ అంటే మామూలు విష‌యం కాదు. అయితే ఇప్పుడు ఉన్న టిక్కెట్ రేట్లు.. 300 థియేట‌ర్ల మూత‌తో ఈ సినిమా రిలీజ్ అయితే అందులో స‌గం వ‌సూళ్లు అయినా రాబ‌డుతుందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. కొత్త రేట్ల కోసం క‌మిటీ వేసినా.. అవి జ‌న‌వ‌రి 7వ తేదీలోపు వ‌స్తాయా ? అన్న డౌట్ కూడా ఉంది.

మ‌రోవైపు సినిమా రిలీజ్ వేసే ఛాన్స్ లేదు. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌, నార్త్‌లో టిక్కెట్లు ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు రిలీజ్ చేస్తే భారీ న‌ష్టం త‌ప్ప‌దు. ఏదేమైనా త్రిఫుల్ ఆర్ క‌ష్టాలు అయితే మామూలుగా లేవు. మ‌రి ఈ గండాలు అన్నింటిని ఎలా అధిగ‌మిస్తుందో ? చూడాలి.