రాజమౌళితో గొడవపడి ఆత్మహత్య చేసుకున్న సీనియర్ నటుడు !

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాహుబ‌లి సినిమాతో టాలీవుడ్ ఖ్యాతిని పెంచిన ఈయ‌న.. కెరీర్ స్టార్టింగ్ నుంచీ అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో క‌లిసి `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని తెర‌కెక్కించాడు.

- Advertisement -

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే.. దర్శకులతో నటులు గొడవ పడడం స‌ర్వ సాధార‌ణం. ఈ నేపథ్యంలోనే రాజమౌళితో గొడవపడి.. చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడో న‌టుడు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు తిరుమల సుందర శ్రీరంగనాథ్. 1969లో బుద్ధిమంతుడు సినిమాతో వెండితెరకు పరిచయమై రంగ‌నాథ్‌.. సుమారు 300 సినిమాలలో నటించాడు.

హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌ను పోషించి ప్రేక్షకులను మెప్పించాడు. మొగుడ్స్ పెళ్లామ్స్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కొన్ని టీ వీ సీరియళ్లలో కూడా నటించాడు. రాజమౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `శాంతి నివాసం` సీరియ‌ల్‌లోనూ రంగ‌నాథ్ న‌టించారు. అయితే ఈ సీరియ‌ల్ షూటింగ్ స‌మ‌యంలో ఒక షాట్ కార‌ణంగా రాజ‌మౌళి- రంగ‌నాథ్‌ల మ‌ధ్య వివాదం చెల‌రేగింది. దీంతో సీరియల్ నిర్మాత కె.రాఘవేంద్రరావు మరికొందరు కలిసి ఆయనను ఇండస్ట్రీలో బ్యాన్ చేశారు.

అప్పటికే తన భార్య అనారోగ్యంతో మంచం పట్టడం వల్ల ఏదో ఖర్చుల కోసం సినిమాలలో నటిస్తున్న రంగనాథ్ కు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇంత‌లోనే భార్య మ‌ర‌ణించింది. దీంతో మాన‌సికంగా కృంగిపోయిన రంగ‌నాథ్‌.. 2015లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అప్ప‌ట్లో ఈయ‌న మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మ‌లో సంచ‌ల‌నం రేపింది.

Share post:

Popular