నక్సలైట్‌గా మారిన వ‌ర్మ‌..క‌త్తితో న‌రుకుతూ ర‌చ్చ ర‌చ్చ‌!(వీడియో)

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఏం చేసినా, ఏం మాట్లాడినా సంచ‌ల‌న‌మే. ప్ర‌స్తుతం ఈయ‌న కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న`కొండా` అనే సినిమా చేస్తున్నాడు. కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక‌పోతే తాజాగా వ‌ర్మ న‌క్స‌లైట్‌గా మారి గన్, కత్తి పట్టుకొని ర‌చ్చ ర‌చ్చ చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కొండా సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి అయిన సంద‌ర్భంగా వరంగల్‌లోని గోపాల్‌పూర్‌ కొండామురళి గెస్ట్‌హౌస్‌లో చిత్రయూనిట్ పార్టీ ఏర్పాటు చేసింది.

ఈ పార్టీకి కొండ దంపతులు కూడా పాల్గోన్నారు. అలాగే ఈ వేడుకలో నక్సలైట్‌ గెటప్‌లో వచ్చిన వ‌ర్మ‌.. పెద్ద తల్వార్ ను చేత‌ప‌ట్టి కేకును ముక్కలు ముక్కలుగా న‌రుకుతూ హ‌ల్‌చ‌ల్ చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

ఇక ఈ సంద‌ర్భంగా వ‌ర్మ మాట్లాడుతూ.. `కొండా మురళి జీవించిన జీవితమే నా సినిమా కథ. గాంధీ ఒకవైపు, హిట్లర్ మరోవైపు ఉంటే కొండా మురళి మధ్యలో ఉన్నారు. త‌నను జైలులో చంపేస్తారా? అనేదాన్ని ఎదుర్కొని, చావుతో ఆడుకుని, నేడు ఇక్క‌డ కూర్చున్నారు. కొండా ముర‌ళి ఎక్స్‌పీరియ‌న్స్‌లు విని నేను విప‌తీరంగా ప్ర‌భావితం అయ్యాను. నా కెరీర్‌లో కొండా మురళి కంటే బెటర్ సబ్జెక్ట్ మ‌రొక‌టి దొరకలేదు. నేను అనుకున్నది 20 శాతం తీసినా నా కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది` అని చెప్పుకొచ్చారు.

https://www.instagram.com/tv/CX8HwMvFt7X/?utm_source=ig_web_copy_link