బిగ్‌బాస్‌లో ప్రియాంక ఎన్ని ల‌క్ష‌లు వెన‌కేసిందో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ముగింపు ద‌శ‌కు చేరువ‌వుతోంది. ఇప్ప‌టికే సింగ‌ర్ శ్రీ‌రామ్ టికెట్ టు ఫినాలే విజేతగా నిలిచి సీజన్ 5 తొలి ఫైనలిస్ట్‌గా సత్తా చాటాడు. ఇక మ‌రోవైపు ప‌ద‌మూడో వారం మానస్, శ్రీరామ్, కాజల్‌, ప్రియాంక, సిరిలు నామినేష‌న్స్‌లో ఉండ‌గా.. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయిపోయింది.

అమ్మాయిలకు మించిన గ్లామర్ ప్రియాంక సొంతం కాగా.. తన అందం, ఆటతీరుతో ప్రేక్షకులకు బాగానే వినోదం పంచింది. కానీ, ఎప్పుడూ మాన‌స్ చుట్టూనే తిరుగుతూ, అత‌డి జ‌ప‌మే చేస్తుండ‌డం ప్రేక్ష‌కుల‌కు ఏ మాత్రం న‌చ్చ‌లేదు. అదే ప్రియాంక కొంప ముచ్చింది. మొత్తానికి టాప్ 5కి వెళ్ల‌కుండా ప‌ద‌మూవో వారమే ఎలిమినేట్ అయిన ప్రియాంక సింగ్‌.. బిగ్‌బాస్ షో ద్వారా బాగానే సంపాదించింద‌ట‌.

వినిపిస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారమైతే.. ఆమెకు వారానికి 1.75 నుంచి 2 లక్షల రూపాయల వరకు బిగ్ బాస్ నిర్వాహ‌కులు చెల్లించార‌ట‌. ఈ లెక్క 13 వారాల‌కు గానూ ప్రియాంక దాదాపు రూ. 25 లక్షల రూపాయలు వెన‌కేసింద‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

కాగా, ప్ర‌స్తుతం హౌస్‌లో మానస్, శ్రీరామ్, కాజల్‌, సిరి, ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, స‌న్నీలు మాత్ర‌మే మిగిలి ఉన్నారు. ఈ ఆరుగురూ ఇప్పుడు బిగ్‌బాస్ సీజ‌న్ 5 టైటిల్‌ను ద‌క్కించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక ఈ సారి ట్రోఫీని ముద్దాడే విజేత ఎవరనే విష‌యాన్ని పక్కన పెడితే.. విన్నర్‌కి మాత్రం 50 లక్షల ప్రైజ్‌మనీతో పాటుగా 300 స్క్వేర్ ఫీట్ గల ఫ్లాట్ కూడా ద‌క్క‌బోతోంది.