మహాభారతం’లో ఎన్టీఆర్, చరణ్.. బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..!

రాజమౌళి ఎన్నో కలలు కన్న ప్రాజెక్ట్ మహాభారతం. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. రాజమౌళి మరి ఆ సినిమా ని ఎప్పుడు తెరకు ఎక్కిస్తారు అంటే మాత్రం.. రాజమౌళి ఆ సినిమా తీయాలంటే ఇంకా అనుభవం కావాలి.. ఆ అనుభవం తనకు రాలేదని.. అలాంటి అనుభవం వచ్చింది అనుకున్నాకే భవిష్యత్తులో ఈ సినిమాని చేస్తానని తెలియజేశాడు. అయితే ఇంకో 10 సంవత్సరాల తరువాత ఆ సినిమాని తీయవచ్చని 7 సంవత్సరాల క్రిందటే తెలియజేశాడు జక్కన్న.

Jr NTR On Working With SS Rajamouli In RRR: "He Is Still The Same 'Jakkanna' To Me"

అయితే ఆయన చెప్పిన ప్రకారం మరో మూడేళ్లలో ఈ సినిమాను తెరకెక్కించ వచ్చేమో.. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి గా ఉంది. అయితే ఇందులో నటించడానికి వివిధ ఇండస్ట్రీలలో ఉండే నటీనటులను ప్రధాన పాత్రలలో తీసుకోవచ్చు. అయితే ఇందులోని ముందుగా పాత్రలకు బుక్ అయింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మహాభారతం ప్రాజెక్టులో భాగం కానున్నట్లు గా రాజమౌళి తెలియజేయడం జరిగింది.

RRR Movie (@RRRMovie) / Twitter

ఈ విషయం విన్న బాలకృష్ణ అభిమానులు చాలా ఫైర్ అవుతున్నారు.. అందుకు కారణం ఏమిటంటే.. రామ్ చరణ్, తన తండ్రితో కలిసి ఆచార్య మూవీ లో నటించాడు. ఇక ఇప్పుడు RRR లో కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి నటించాడు. కానీ బాలకృష్ణతో, ఎన్టీఆర్ ఒక్క సినిమాలో కూడా కలసి నటించడం లేదు. కనీసం ఇలాంటి మహా భారతం సినిమా లో అయినా కూడా బాలయ్య నటిస్తారు అనుకుంటే.. ఇందులో కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ లే కలిసి నటిస్తారని చెప్పడంతో బాలయ్య అభిమానులు కూడా చాలా కోపంగా ఉన్నారు రాజమౌళి పైన.. అయితే ఈ విషయంపై స్పందించి రాజమౌళి,బాలకృష్ణ.. ఎన్టీఆర్ తో కలిసి ఈ సినిమా లో నటించే అవకాశం ఇస్తారేమో చూడాలి మరి.

Share post:

Latest