ఆచార్య విజువల్ ట్రీట్ మామూలుగా ఉండదట..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆచార్య. ఇందులో మరో కీలకమైన పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ పాత్రను పరిచయం చేస్తూ సిద్ధ సాగా టీజర్ కూడా విడుదల చేశారు. ఈ టీజర్ కు అభిమానుల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఆచార్య నుంచి ముందు ముందు విజువల్ ట్రీట్ మరింత ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.

చిరంజీవి రామ్ చరణ్ కలిసి ఇంతకుముందు మగధీర, బ్రూస్ లీ సినిమాల్లో కలిసి నటించినప్పటికీ వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు నిమిషాలు మాత్రమే ఉంటాయి. కానీ ఆచార్య సినిమాలో మాత్రం ఇద్దరు కలిసి నటిస్తున్నారు. చిరంజీవి చరణ్ కలిసి ఒక పాటలో డ్యాన్స్ చేసింది ఎప్పుడూ లేదని, ఖైదీ నంబర్ 150 సినిమాలో కొన్ని సెకన్ల పాటు మాత్రమే రామ్ చరణ్ కనిపిస్తాడని.. కానీ ఆచార్య సినిమాలో ఇద్దరిపైనా ఒక సాంగ్ ఉంటుందని కొరటాల తెలిపాడు. శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో తీసిన ఈ పాట అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వడం ఖాయమని చెప్పాడు.

ఆ సాంగ్ చిత్రీకరణ జరిగిన వారం రోజుల పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వచ్చి చూశారని తెలిపాడు. అలాగే థియేట్రికల్ ట్రైలర్ లో కూడా ఇద్దరిని కలిపి చూపించబోతున్నట్లు వెల్లడించాడు. సినిమా విడుదల అయ్యే లోగా మరిన్ని సప్రైజ్ లు ఉంటాయని కొరటాల శివ తెలిపాడు. ఆచార్య సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.