ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రముఖ టీవీ ఛానెల్ ఈటీవీలో 2013 న ప్రారంభమైన ఈ షో ద్వారా ఎందరో కమెడియన్లు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కొందరైతే జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో హీరోలుగానూ మారారు. తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రజాదరణ పొందిన కార్యక్రమాల్లో జబర్దస్త్ కూడా ఒకటి.
అయితే అటు మల్లెమాలకు, ఇటు ఈటీవీకి కాసుల వర్షం కురిపించిన ఈ షో ఇటీవల కాలంలో పూర్తిగా డల్ అయిపోయింది. ఒకప్పుడు పదికి పైగా రేటింగ్‌ను సొంతం చేసుకున్న జబర్దస్త్.. ఇప్పుడు ఐదు రేటింగ్‌ను సంపాదించడానికే కష్టమైపోయింది. స్కిట్‌లు రొటీన్ అయిపోవడం, ఇతర ఛానెల్స్‌లో ఇటువంటి షోలే వచ్చేయడం, యూ ట్యూబ్‌లో స్కిట్లు అందుబాటులో ఉండటం.. ఇవన్నీ జబర్దస్త్‌కి మైనస్‌గా మారాయి.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనే సంస్క్కృతి సైతం ఈ షోకి దాపురించిందని టాక్ బయటకు వచ్చింది. గత కొద్ది రోజుల నుంచీ కొద్ది రోజుల నుండి కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా రంగంలో ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి కాస్టింగ్ కౌచ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయితే జబర్దస్త్ లోనూ లేడీ ఆర్టిస్టులు కాస్టింగ్ కౌచ్‌తో ఇబ్బందులు పడుతున్నారట. ఒకరిద్దరు జబర్‌దస్త్ స్టార్ల వల్ల కొందరు లేడీ ఆర్టిస్టులు వేధింపులకు గురవుతున్నారని.. ఈ వ్యవహారం మల్లెమాల వద్దకు కూడా తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. మరి ఇదే నిజమైతే.. త్వరలోనే ఈ విషయంపై ఎవరో ఒకరు మీడియా ముందుకొచ్చి కుండబద్దలు కొట్టడం ఖాయం.