కీర్తి సురేష్ ఇంట ఘ‌నంగా క్రిస్టమస్ సెల‌బ్రేష‌న్స్‌..ఫొటోలు వైర‌ల్‌!

నేడు క్రిస్ట‌మ‌స్ పండ‌గ అన్న విష‌యం తెలిసిందే. ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు క్రిస్టమస్ పండ‌గ‌ను నేడు ఎంతో ఘ‌నంగా జ‌ర‌పుకుంటారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇంట కూడా క్రిస్ట‌మ‌స్ సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రిగాయి. తన ఇంట్లోనే క్రిస్మస్‌ చెట్టుని డెకరేట్‌ చేసుకుని.. ఫ్రెండ్స్‌తో సెల‌బ్రేష‌న్స్‌లో మునిగి పోయింది.

అలాగే ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్న కీర్తి.. త‌న ఫాలోవ‌ర్స్ అంద‌రికీ క్రిస్ట‌మ‌స్ విషెస్‌ను తెలియ‌జేసింది. ప్ర‌స్తుతం ఈమె షేర్ చేసిన ఫొటోలు అభిమానుల‌ను, నెటిజ‌న్లు ఆక‌ట్టుకుంటూ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

ఇక కీర్తి సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబుకు జోడీగా `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తోంది. అలాగే మెహ‌ర్ ర‌మేష్ తెర‌కెక్కిస్తున్న `భోళా శంక‌ర్‌` చిత్రంలో మెగా స్టార్ చిరంజీవికి చెల్లెలుగా న‌టిస్తోంది.

ఈమె న‌టించి లేడీ ఓరియెంటెడ్ చిత్రం `గుడ్‌లక్‌ సఖీ` మూవీ డిసెంబ‌ర్ 31న రిలీజ్ కాబోతోంది. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఆది, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. మ‌రోవైపు కీర్తి సురేష్ త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

 

Share post:

Popular