భారీ ధ‌ర‌కు `శ్యామ్ సింగ‌రాయ్‌` శాటిలైట్‌ రైట్స్‌..ఎవరికి ద‌క్కాయంటే?

న్యాచుర‌ల్ స్టార్ నాని తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు.

ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 24న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. ఒక్కో అప్డేట్‌ను వ‌దులుతూ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 14న వరంగల్‌లోని రంగలీల మైదానంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ను ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీ భారీ ధ‌ర‌కు దక్కించుకుంది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. `శ్యామ్ సింగరాయ్` సినిమా తెలుగు శాటిలైట్ హక్కులను రూ. 10 కోట్లకు జెమినీ టీవీ వారు ద‌క్కించుకున్నార‌ట‌. దీంతో నాని కెరీర్‌లో శాటిలైట్ రైట్స్ పరంగా ఇదే బిగ్గెస్ట్ డీల్ అని తెలుస్తోంది.

అలాగే మ‌రోవైపు ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 10 కోట్లకు బి4యు ఛానెల్ దక్కించుకుంది. నాని నటించిన హిందీ సినిమాలకు మంచి గిరాకీ ఉంది. ఈ నేప‌థ్యంలోనే శ్యామ్ సింగ‌రాయ్‌కి ఈ రేంజ్ రేటు పలికిందని చెబుతున్నారు. కాగా, మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నాని దిపాత్రాభిన‌యం చేస్తున్నాడు.

 

Share post:

Latest